Covid in Madhya Pradesh: అంబులెన్స్ నుంచి ఎగిరి రోడ్డుపై పడిన కరోనా డెడ్ బాడీ!

మన దేశంలో కరోనా రెండో దశ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మొత్తం దేశంలో మూడు లక్షలకు పైగా కేసులతో గత ఏడాది కంటే ఈ ఏడాది సరికొత్త రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

Covid in Madhya Pradesh: మన దేశంలో కరోనా రెండో దశ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మొత్తం దేశంలో మూడు లక్షలకు పైగా కేసులతో గత ఏడాది కంటే ఈ ఏడాది సరికొత్త రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఆసుపత్రులల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత దాపురించగా మృతదేహాల ఖననం, దహనానికి శ్మశానాల వద్ద అంబులెన్సులు క్యూలు కడుతున్నాయి.

కరోనాతో మరణించిన మృతదేహాల విషయంలో పలు రాష్ట్రాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తుండగా బాధితుల మృతదేహాలను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ఘటన ఒకటి వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ లో ఆసుపత్రి నుండి స్మశానానికి వెళ్తున్న అంబులెన్స్ నుండి కరోనా డెడ్ బాడీ ఎగిరి రోడ్డు మీద పడింది. విదిషా జిల్లాలో ఓ ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు తరలిస్తున్న సమయంలో అంబులెన్స్‌ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ వైద్య కళాశాల వద్దకు రాగానే ఓ కరోనా మృతదేహం బయటపడింది.

మృతదేహాలను తరలించే వాహనం అద్వాన్నంగా ఉండడం.. కనీసం అద్దాలు, డోర్లు కూడా సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. వాహనమున్న అద్వాన్న స్థితికి తోడు డ్రైవర్ అధిక వేగంతో వాహనాన్ని మలుపు తిప్పడంతో వాహనం గేట్ విరిగి మృతదేహం ఎగిరి రోడ్డుపై పడింది. దీన్ని గమనించిన కరోనా రోగుల బంధువులు ఆసుపత్రి బయటకి వచ్చి హాస్పిటల్‌ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనికి సంబధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.

Read: Covid-19 in AP: ఉత్తరాంధ్రలో వైరస్ విలయతాండవం.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్

ట్రెండింగ్ వార్తలు