Covid-19 in AP: ఉత్తరాంధ్రలో వైరస్ విలయతాండవం.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్

గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఏపీలో రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ హడలెత్తించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కొత్త కేసులు ప్రజలను వణికించాయి. అయితే.. కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో ఇది కాస్త తక్కువగానే నమోదయ్యాయి.

Covid-19 in AP: ఉత్తరాంధ్రలో వైరస్ విలయతాండవం.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్

Covid 19 In Ap

Covid-19 in AP: గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఏపీలో రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ హడలెత్తించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కొత్త కేసులు ప్రజలను వణికించాయి. అయితే.. కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో ఇది కాస్త తక్కువగానే నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో అయితే ఇది మరికాస్త తక్కువగానే నమోదయ్యాయి. కానీ.. ఈ ఏడాది సెకండ్ వేవ్ లో మాత్రం ఈ జిల్లాలకు మహమ్మారి మినహాయింపు ఇవ్వలేదు. ఇక్కడ రికార్డు స్థాయిలో వైరస్ విజృంభణ సాగుతుంది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతూ ప్రజలను భయకంపితులను చేస్తుంది. ఇందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అన్న తేడా లేదు. అందరినీ వరసబెట్టి కమ్మేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా విజయనగరం జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఇద్దరూ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

ప్రస్తుతానికి ఇద్దరు ఎమ్మెల్యేలు వైద్యుల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు. కాగా గత కొన్నిరోజుల వ్యవధిలో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు కోవిడ్ నిర్ధారణతో ఇప్పుడు జిల్లా వైసీపీ క్యాడర్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేల అనుచరులు, ఎమ్మెల్యేలను కలిసిన కార్యకర్తలు ఎవరికి వారు వారి ఆరోగ్యంపై గాబరా పడుతున్నట్లు తెలుస్తుంది.

Read: Corona Second Wave: గోడ‌లు బ‌ద్ద‌లుగొట్టి మరీ 30 మంది కరోనా రోగుల ప‌రారీ..