Vegetable Farming : రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్న నల్గొండ రైతు

8 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి.. 2 ఎకరాలలో మాత్రం 2021 ఏప్రిల్ నుండి కూరగాయల సాగు చేపడుతున్నారు. డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.. దిగుబడి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు.

Cultivation of vegetables

Vegetable Farming : రైతుకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. ప్రణాళికాబద్ధంగా,  దఫ దఫాలుగా పంటలు వేసుకుంటే.. ఏడాది పొడవునా దిగుబడులను తీయవచ్చు. అంతే కాదు.. మార్కెట్ లో ఒకసారి కాకపోయినా, మరోసారైనా మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. ఈ సూత్రాన్నే అమలు పరుస్తూ.. ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తూ..  అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన  రైతు.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

ఇదిగో ఇక్కడ చూడండీ.. చివరి దశలో ఉన్న కాకర, క్యాబేజి పంట. ఇప్పుడిప్పుడే దిగుబడి వస్తున్న టమాట. ఆ పక్కనే దోస. ఇలా ఒకే క్షేత్రంలో ఒక పంట చివరి దశలో మరోపంటను విత్తి దిగబడిని తీసుకునే విధంగా ప్రణాళిక బద్దంగా సాగుచేస్తున్న ఈ రైతే పేరు యుగంధర్ రెడ్డి. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, నారమ్మగూడెం గ్రామానికి చెందిన ఈయన అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగుచేస్తూ.. నిరంతరం పంట దిగుబడులను పొందుతున్నాడు.

READ ALSO : Agriculture : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదిలి వ్యవసాయం.. పుట్టగొడుగులతో లాభాలు

రైతు యుగందర్ రెడ్డి కి నాగర్జున సాగర్ ఎడుమ కాలువ కింద 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో ఎప్పుడు వరిసాగుచేసేవారు. అయితే ఏ ఏటికాయేడు పెట్టుబడులు పెరిగిపోవటం.. ఇటు దిగుబడులు కూడా తగ్గిపోతు వస్తున్నాయి. వచ్చిన దిగుబడికి మార్కెట్ లో ధర రాక నష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యలనుండి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూరగాయల సాగును చేపట్టారు.

READ ALSO : Beera Cultivation : బీరసాగులో అనువైన రకాల ఎంపిక !

8 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి.. 2 ఎకరాలలో మాత్రం 2021 ఏప్రిల్ నుండి కూరగాయల సాగు చేపడుతున్నారు. డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.. దిగుబడి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు. ఇలా ఏడాదంతా ఒక పంట పూర్తి అవుతుండగానే మరో అంతర పంట నుండి దిగుబడులతోపాటు ఆదాయం పొందుతున్నాడు.

READ ALSO : Ladies Finger Cultivation : ప్రకృతి విధానంలో బెండ సాగు.. ఎకరాకు 2 లక్షల నిరకర ఆదాయం

మార్కెట్ కు అనుగుణంగా కూరగాయలు పండిస్తున్న రైతు యుగంధర్ రెడ్డి ఏడాదికి రెండు ఎకరాలపై దాదాపు 4 లక్షల 50 వేల నికర ఆదాయం పొందుతున్నారు. అంతే కాదు తనతో పాటే మరికొంత మందికి పనికల్పిస్తున్నారు. ఈ రైతు సాగు విధానాన్ని చూసిన చుట్టుప్రక్కల రైతులు సైతం కూరగాయలు పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు