Ladies Finger Cultivation : ప్రకృతి విధానంలో బెండ సాగు.. ఎకరాకు 2 లక్షల నిరకర ఆదాయం

రైతు ఎర్రాకులం తనకున్న వ్యవసాయ భూమిలో ఏటా ఎకరం విస్తీర్ణంలో బెండను సాగుచేస్తుంటారు. అయితే ఈ సారి పెరిగిన పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నారు.

Ladies Finger Cultivation : ప్రకృతి విధానంలో బెండ సాగు.. ఎకరాకు 2 లక్షల నిరకర ఆదాయం

Ladies Finger Cultivation

Ladies Finger Cultivation : వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు,  గిట్టుబాటు కాని ధరలు… తదితర కారణాలతో సేద్యం భారంగా మారింది. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్నివదిలి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. కానీ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలను పండిస్తున్నాడు. బెండ సాగులో నాణ్యమైన దిగుబడి తీస్తూ.. ఎకరాకు 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : Lady Finger Cultivation : 2 ఎకరాల్లో బెండసాగు.. 3 నెలల్లో రూ. 2 లక్షల ఆదాయం

వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే, పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా వుండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు, వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి.

READ ALSO : Ridge Gourd Cultivation : వేసవి బీరసాగులో మెళకువలు…రైతులు పాటించాల్సిన యాజమాన్యపద్ధతులు

ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా, పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు, సేద్యంపట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, చించినాడ గ్రామానికి చెందిన రైతు వీరరాఘవులు

READ ALSO : Ladies Finger : బెండసాగులో యాజమాన్యం, సస్యరక్షణ

రైతు ఎర్రాకులం తనకున్న వ్యవసాయ భూమిలో ఏటా ఎకరం విస్తీర్ణంలో బెండను సాగుచేస్తుంటారు. అయితే ఈ సారి పెరిగిన పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నారు. ఎలాంటి ఎరువులు పురుగుమందులను వాడటంలేదు. పశువుల ఎరువుతో పాటు స్థానికంగా దొరికే ఆకులతో కషాయాలను తయారుచేసి పంటలకు పిచికారి చేస్తూ.. నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను సొంతంగా వినియోగదారులకు అమ్ముతూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.