Father whatsapp status : తండ్రి వాట్సాప్ స్టేటస్ షేర్ చేసిన కూతురు.. రియాక్టైన స్విగ్గీ

మనకి ఎవరిమీదైనా కోపం వచ్చినా.. ఎవరినైనా తిట్టేయాలనిపించినా.. ఏదైనా బాధ కలిగినా సోషల్ మీడియా ఆయుధం అయిపోయింది. తన కూతురికి చెప్పిన పని మర్చిపోయిందని బాధతో ఓ తండ్రి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. కూతురు దానిని షేర్ చేసింది.. ఏంటి మ్యాటర్ అంటారా?

Father whatsapp status

Daughter shared father’s whatsapp status : తండ్రికి పండ్లు ఆర్డర్ చేయడం మర్చిపోయింది కూతురు. బాధపడిన ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. ఆ స్టేటస్‌ని కూతురు ట్విట్టర్‌లో షేర్ చేసుకుంది.. దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది. ఇంతకీ ఆ తండ్రి వాట్సాప్ స్టేటస్‌లో ఏం పెట్టారనేగా మీ డౌట్.. చదవండి.

ఆఫ్‌లైన్‌లోనూ వాట్సాప్ మెసేజ్‌ పంపొచ్చు!

ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలకు ఏదో ఒక పనులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆన్ లైన్‌లో పండ్లు, మందులు, వస్తువులు కొనుగోలు చేయడం రానివారంత పిల్లలపైనే ఆధారపడతారు. ఓ పెద్దాయన తన కూతురికి పండ్లు ఆర్డర్ చేయమని చెప్పారు. ఆ అమ్మాయి పనిలో పడి ఆర్డర్ చేయడం మర్చిపోయింది. దాంతో ఆయన మనసుకి బాధ అనిపించిందేమో ‘ లోకానికి ఎందుకు మొరపెట్టుకోవాలి.. మన స్వంత పిల్లలే మమ్మల్ని ఆదుకోరు’ అంటూ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నారు. అది చూసి బాధపడిన కూతురు ‘ నాన్న అడిగిన పండ్లను ఆన్‌లైన్‌లో బుక్ చేయడం మర్చిపోయాను.. అందుకు నాన్న ఇలా స్టేటస్ పెట్టుకున్నారని’ ఆయన పెట్టిన స్టేటస్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసింది. @hajarkagalwa అనే యూజర్ ఐడీతో ఈ పోస్ట్ షేరైంది.

ఆఫ్‌లైన్‌లోనూ వాట్సాప్ మెసేజ్‌ పంపొచ్చు!

ఈ పోస్ట్‌కు స్విగ్గీ నుండి కూడా స్పందన వచ్చింది. ‘పండ్లను ఆర్డర్ చేయడానికి, మీ వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి ఇది సమయం’ అంటూ స్విగ్గీ ఓ ఫోటోని యాడ్ చేసి రిప్లై ఇచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నాన్నలు ముద్దుగా ఉంటారు’ అని.. ‘చాలా ఫన్నీ’ అనీ కామెంట్లు పెట్టారు.