Delhi’s triple suicide: దారుణం.. విషవాయువు పీల్చి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో శనివారం ఈ ఘటన జరిగింది.

Delhi’s triple suicide: ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వసంత్ అపార్టుమెంట్‌లో ఒక ఫ్లాట్ నుంచి పోలీసులకు సమాచారం అందింది.

Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక

ఫ్లాట్‌లోని వాళ్లు తలుపులు తీయడం లేదని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఒక మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు కనిపించాయి. మృతులను మంజు, ఆమె కూతుళ్లు అన్షిక, అంకుగా గుర్తించారు. అయితే, వాళ్లు ఆత్మహత్య చేసుకున్నతీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆత్మహత్య తీరుకు సంబంధించి వాళ్లు సూసైడ్ నోట్‌లో రాశారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఇంటిని పూర్తిగా మూసేశారు. తలుపులు, కిటికీలు అన్నీ మూసేశారు. గాలి బయటకు వెళ్లకుండా మొత్తం పాలిథీన్ కవర్లతో మూసి ఉంచారు. ఇంటిని ఒక గ్యాస్ చాంబర్‌గా మార్చుకున్నారు. గ్యాస్ లోపలి నుంచి బయటకు వెళ్లకుండా చేసుకున్న తర్వాత, ఇంట్లో గ్యాస్ లీక్ చేశారు. ఆ గ్యాస్ పీల్చి, ఊపిరాడకపోవడంతో ముగ్గురూ మరణించారు. దీని గురించి లేఖలో రాసుకుంటూనే పోలీసులకు సూచనలు చేశారు. ఇంటి లోపల డెడ్లీ గ్యాస్ ఉందని, దీని వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని లేఖలో రాశారు.

Lakshya Sen met Modi: ప్రధాని మోదీ అడిగిన ఆ ‘చిన్ని కోరిక’ తీర్చిన భారత స్టార్ షట్లర్

ఇంటి లోపలికి వచ్చేముందు కిటికీలు, తలుపులు తెరవాలని సూచించారు. అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. పోలీసులు ముగ్గురి ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురి మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, గత ఏడాది మంజు భర్త మరణించాడని, దీంతో అప్పటినుంచి కుటుంబం డిప్రెషన్‌లో ఉందని, ఇదే ఆత్మహత్యకు కారణం అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు