Lakshya Sen met Modi: ప్రధాని మోదీ అడిగిన ఆ ‘చిన్ని కోరిక’ తీర్చిన భారత స్టార్ షట్లర్

ఈక్రమంలో క్రీడాకారుడు లక్ష్య సేన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ..తనను కలిసేందుకు జట్టుతో సహా రావాలని, వస్తూ వస్తూ..అల్మోరా యొక్క బాల్ మిథాయ్ తీసుకురావాలంటూ చిరు కోరిక కోరారు.

Lakshya Sen met Modi: ప్రధాని మోదీ అడిగిన ఆ ‘చిన్ని కోరిక’ తీర్చిన భారత స్టార్ షట్లర్

Modi

Lakshya Sen met Modi: భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బాడ్మింటన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే “థామస్ కప్’లో భారత షట్లర్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కప్ గెలిచిన అనంతరం భారత బాడ్మింటన్ క్రీడాకారులతో ఫోన్ ద్వారా సంభాషించిన ప్రధాని మోదీ వారి అద్భుత విజయాన్ని అభినందించారు. భారత దేశం గొప్ప క్రీడాకారులను చూసి గర్విస్తుందంటూ కొనియాడారు. ఈక్రమంలో క్రీడాకారుడు లక్ష్య సేన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ..తనను కలిసేందుకు జట్టుతో సహా రావాలని, వస్తూ వస్తూ..అల్మోరా యొక్క బాల్ మిథాయ్ తీసుకురావాలంటూ చిరు కోరిక కోరారు. ఈక్రమంలో థామస్ కప్, ఉబర్ కప్ లో పాల్గొన్నభారత బాడ్మింటన్ క్రీడాకారులను ప్రధాని మోదీని ఆదివారం తన నివాసంలో కలుసుకున్నారు.

other storeis:Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక

“మొదట, నా కోసం అల్మోరా యొక్క బాల్ మిథాయ్‌ని తీసుకువచ్చినందుకు నేను లక్ష్యాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అతను నా చిన్న అభ్యర్థనను గుర్తుంచుకొని దానిని నెరవేర్చినందుకు నేను చాలా కృతజ్ఞుడను” అని ప్రధాని మోదీ అన్నారు. దీనిపై లక్ష్య సేన్ స్పందిస్తూ..”యూత్ ఒలింపిక్స్‌లో నేను పతకం సాధించినప్పుడు, మొదటిసారి మిమ్మల్ని(మోదీని) కలుసుకున్నాను. మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని రెండో సారి కలిసే అవకాశం వచ్చింది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి, అది మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ నుంచి చాలా ప్రేరణ పొందుతున్నాము. మీతో ఫోన్ కాల్ మాట్లాడడం మా అందరికీ నిజంగా గొప్ప అనుభూతి. మరిన్ని టోర్నమెంట్‌లను గెలవాలని, మిమ్మల్ని కలవాలని మరియు మీ కోసం బాల్ మిథాయ్ తీసుకురావాలని నేను కోరుకుంటున్న.” అంటూ లక్ష్య సేన్ ప్రధానితో అన్నారు.

other stories:Himanta Biswa: రాహుల్ గాంధీపై మండిపడ్డ అస్సాం సీఎం హిమంతా: వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు

లక్ష్య సేన్ ఇలాగె తన చిన్నపిల్లల స్వభావాన్ని కొనసాగించాలని, మున్ముందు పెద్ద లక్ష్యాలను సాధించడానికి కష్టపడాలని ప్రధాని మోదీ సూచించారు. అనంతరం మీడియా ఇంటరాక్షన్‌లో, లక్ష్య సేన్ మాట్లాడుతూ, “ప్రధాని మోదీ చిన్న, చిన్న విషయాలను కూడా ఎంతో చక్కగా గుర్తుంచుకుంటారని, అల్మోరా(లక్ష్య సేన్ సొంత ఊరు)లో ‘బాల్ మిఠాయి’ చాలా ప్రసిద్ధి చెందిందని ఆయనకు తెలుసు, కాబట్టి దానిని తీసుకురమ్మని నన్ను అడిగారు. మోదీ గారి కోసం నేను మిఠాయి తీసుకొచ్చాను. ఇంకా మా తాత, నాన్న కూడా క్రీడాకారులనే విషయం కూడా ప్రధానికి తెలుసు. ఈ చిన్న చిన్న విషయాలు మనసుకు చాలా ముఖ్యమైనవి. అంత గొప్ప వ్యక్తి మనతో ఈ విషయాలు చెప్తున్నారు, కాబట్టి మోదీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.” అని లక్ష్య సేన్ అన్నారు.