Himanta Biswa: రాహుల్ గాంధీపై మండిపడ్డ అస్సాం సీఎం హిమంతా: వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు

అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అస్సాం ఎన్నడూ భారత్ తో శాంతి చర్చలు జరపలేదని సీఎం బిశ్వ అన్నారు

Himanta Biswa: రాహుల్ గాంధీపై మండిపడ్డ అస్సాం సీఎం హిమంతా: వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు

Rahul

Himanta Biswa: భారత్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి లండన్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. భారత్ లో సమస్యలపై మాట్లాడితే అధికార బీజేపీ, పీఎం మోదీ వినే స్థితిలో లేరని..దేశంలో స్థిరత్వం తెచ్చే విధంగా వివిధ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సక్యత కుదుర్చుకోవడం లేదంటూ శుక్రవారం రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమం ద్వారా ఉద్బవించిన ఈ దేశంలో చర్చల ద్వారా రాష్ట్రాలు తమ ఉనికిని గుర్తింపును సందించుకున్నాయని, యుపి, మహారాష్ట్ర, అస్సాం మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలు భారత ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపాయని రాహుల్ అన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశం పరువు తీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.

ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అస్సాం ఎన్నడూ భారత్ తో శాంతి చర్చలు జరపలేదని సీఎం బిశ్వ అన్నారు. “ఇదీ బూటకపు మేధావుల ఔన్నత్యం! అస్సాం ఎప్పుడూ భారత్‌తో శాంతి చర్చలు జరపలేదు. కాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం అప్పట్లో నెహ్రూ..మనల్ని పాకిస్తాన్‌తో విడిచిపెట్టినప్పటి నుండి గాంధీజీ మద్దతుతో, గోపీనాథ్ బోర్డోలోయ్ అస్సాంను భారత్ మాతతో ఉంచడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. మిస్టర్ గాంధీ, మీరు వాస్తవాలను సరిచూసుకోండి’’ అని అస్సాం సీఎం హిమంతా బిశ్వ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసి విమర్శల పట్ల అయన తన పంథా మార్చుకోవాలని బీజేపీ నేతలు చురకలంటించారు.

Other Stories:Nirmala Sitharaman: అన్నదాతకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి