Nirmala Sitharaman: అన్నదాతకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

అన్నదాత ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. తొలకరిలోనే విత్తునాటేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రైతులకు సాగుభారం అధికమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎరువుల ధరలు అన్నదాతను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి...

Nirmala Sitharaman: అన్నదాతకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

Nirmala Sitharaman

Nirmala Sitharaman: అన్నదాత ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. తొలకరిలోనే విత్తునాటేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రైతులకు సాగుభారం అధికమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎరువుల ధరలు అన్నదాతను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పొలాల్లో దుక్కులు వేసేందుకు రైతులు ఎక్కువగా ట్రాక్టర్లను ఆశ్రయిస్తారు. డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై అదనపు భారంపడుతుంది. మరోవైపు పొలంలో దుక్కిదున్నే సమయం దగ్గర నుంచి పంట చేతికొచ్చే సమయం వరకు రైతులు ఎరువులను వాడాల్సి ఉంటుంది.

Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

ఎరువుల ధరలు పెరగడంతో సాగు గిట్టుబాటు కాదన్న భావనకు కొందరు రైతులు వస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించడంతోపాటు ఎరువుల ధరల నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. ఎరువుల ధరలు పెరుగుదలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఎరువుల ధరలను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రైతులకు ఉపశమని కలిగించే వ్యాఖ్యలు చేశారు. ఎరువుల ధరలపై రూ.1.10 లక్షల కోట్ల సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. తాజా నిర్ణయంతో 2022-23 ఏడాదికి రూ.2.15 లక్షల కోట్లు రైతులకు ఎరువులపై సబ్సిడీ రూపంలో అందనుంది.

Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..

ప్రపంచ వ్యాప్తంగా రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్నాయని, అయినప్పటికీ దేశంలోని రైతులపై భారం పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రైతులకు ఉపశమనం కలిగించేందుకు బడ్జెట్‌లో లక్షా 5వేల కోట్ల ఎరువుల సబ్సిడీతోపాటు లక్షా 10 వేల కోట్ల అదనపు మొత్తాన్ని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా యూరియా, పొటాసిక్, ఫాస్ఫేటిక్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. అయితే ఎరువుల ధరల ప్రభావం రైతులపై పడకుండా కేంద్ర సబ్సిడీ పెంచింది.