Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

Petrol Price : వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది.

Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

Petrol Price To Reduce By Rs. 9.5, Diesel Rs. 7 As Centre Cuts Excise Duty

Petrol Price : వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గనుంది. లీటర్ పెట్రోల్ ధర రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. రూ.7 వరకు లీటర్ డీజిల్ ధర తగ్గనుంది. రేపు ఉదయం (ఆదివారం) నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.


గ్యాస్ సిలిండర్ పై రూ. 200 సబ్సిడీ :
పీఎం ఉజ్వల యోజనలో గ్యాస్ కనెక్షన్లకు సబ్సిడీ పెంచింది. ఇకపై గ్యాస్ సిలిండర్ ధర రూ.200 సబ్సిడీ అందించనుంది. ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ వర్తించనుంది. దేశంలోని 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లపై అదనపు సబ్సిడీ అందనుంది. ఇది మన తల్లులు, సోదరీమణులకు సహాయం చేస్తుందని, దీని వల్ల సంవత్సరానికి దాదాపు రూ. 6100 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


దిగుమతి సుంకం తగ్గింపు :
ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడిపదార్థాలపై కూడా సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఉక్కు ముడిపదార్థాల దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించనుంది. ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని కేంద్రం విధిస్తామని ప్రకటించింది. సిమెంట్ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

ధరలు తగ్గించడానికి గల కారణాలు ఇవే..
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనాకాలం పూర్తవుతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గుజరాత్ హిమాచల్ ఎన్నికలు ఉండడంతో పాటు భారత్‌కు రష్యా ముడి చమురు, ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తక్కువ ధరకు భారత్‌కు చమురును రష్యా అందిస్తోంది. ఈ కారణంగానే దేశంలో ఇంధన ధరలను కేంద్రం తగ్గించడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

Read Also : Petrol price in hyderabad: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. ఒక్క హైదరాబాద్‌లోనే..