Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..

తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని...

Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..

Pm Vs Cm

Cm Kcr: తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో అభివృద్ధి అధిక భాగం కేంద్రం నిధులతో జరుగుతున్నట్లు బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పలు దఫాలుగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన సమయంలో సీఎం కేసీఆర్ హాజరుకాకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అదే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వస్తున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనలో ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన గతకొద్దిరోజుల క్రితమే నిర్ధారణ అయింది. మోదీ పర్యటనలో పాల్గొనడం ఇష్టంలేకనే సీఎం కేసీఆర్ దేశంలో పలు రాష్ట్రాల పర్యటనను పెట్టుకున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతుంది.

PM Modi: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్

ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించారు. అయితే గత రెండుసార్లు ప్రధాని పర్యటనల్లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. తాజాగా 26న ప్రధాని పర్యటనలోనూ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. దీంతో ముచ్చటగా మూడోసారి తెలంగాణలో ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నట్లు అవుతుంది. 2020 నవంబర్ 28న ప్రధాని హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను సందర్శించారు. ఆ రోజు సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు రావాల్సిన అవసరం లేదని పీఎం కార్యాలయం సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రధానిని కలవలేదని అప్పట్లో తెరాస వివరణ ఇచ్చింది.

CM KCR On Education : తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యా విధానం అమలు చేస్తాం-కేసీఆర్

గత ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్ కు వచ్చారు. ముచ్చింతల్ లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్ లో జరిగిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనడం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ మోదీతో పాటు పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో హాజరు కాలేదు. అయితే జ్వరం కారణంగా సీఎం కేసీఆర్ మోదీ పర్యటనలో పాల్గొనలేదని తెరాస నేతలు పేర్కొన్నారు. తాజాగా ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో జరిగే సమావేశానికి హాజరువుతారు. అదే రోజు సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనలో ఉంటారు. దీంతో కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనడం దాదాపు అసాధ్యం.