PM Modi: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్

దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

PM Modi: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్

Pm Modi

Updated On : May 21, 2022 / 8:54 PM IST

PM Modi: దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రజలే మా మొదటి ప్రాధాన్యత. ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు.. ముఖ్యంగా పెట్రో ధరల తగ్గింపు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. ప్రజల జీవితాన్ని సులభతరం (ఈజ్ ఆఫ్ లివింగ్) చేస్తుంది’’ అని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేంద్రం తాజాగా పెట్రో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Soldier Honey-Trap: హనీట్రాప్‌లో సైనికుడు.. పాక్ యువతికి రహస్య సమాచారం చేరవేత

దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గితే, డీజిల్ ధర రూ.7 వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లపై ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.