Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. దినేష్ అరోరా అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అంగీకారం

దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో ఒకడైన దినేష్ అరోరా అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అనుమతించింది. అతడు ఆప్ నేత మనీష్ సిసోడియాకు సహచరుడు.

Delhi Excise Policy Case: దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన దినేష్ అరోరా అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అనుమతించింది.

Man Kills Girlfriend: ప్రియురాలి గొంతు కోసి చంపి.. మృతదేహంతో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు

వ్యాపారవేత్త అయిన దినేష్ అరోరా అప్ కీలక నేత మనీష్ సిసోడియా అనుచరుడినని కోర్టులో ఒప్పుకొన్నాడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు ఈ నెల 14న రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ఎంకే నాగ్‍పాల్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్వచ్ఛందంగా అన్ని వివరాలు వెల్లడిస్తానని ప్రకటించాడు. దీంతో దినేష్ అరోరా అప్రూవర్ అయ్యేందుకు కోర్టు అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతోపాటు పలువురిపై సీబీఐ, ఈడీలు కేసు నమోదు చేశాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. వారిలో దినేష్ అరోరా ఒకడు. తాజాగా అతడు ఈ కేసులో అప్రూవర్‌గా మారి, అన్ని విషయాలు వెల్లడించేందుకు సిద్ధమయ్యాడు.

Cheapest Electric Car: దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధర ఎంతంటే

దినేష్ గతంలోనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతడి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మరోవైపు ఈ కేసు విచారణకు సంబంధించి 36 మంది వరకు నిందితులు డిజిటల్ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీలో అమలవ్వబోతున్న మద్యం పాలసీ విధివిధానాల గురించిన సమాచారం కొన్ని మద్యం కంపెనీలకు ముందుగానే చేర్చారని ఈడీ తెలిపింది. మద్యం పాలసీ అమ్మకాలకు సంబంధించి రూ.100 కోట్ల వరకు లంచంగా అందిందని ఈడీ చెప్పింది. ప్రస్తుతం కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు