Cheapest Electric Car: దేశంలో చవకైన ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధర ఎంతంటే
అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ అనే సంస్థ ఈ కారును విడుదల చేసింది. బుధవారం నుంచి ఈ కారు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

Cheapest Electric Car: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ అనే సంస్థ. ‘ఈస్-ఈ (ఈఏఎస్-ఈ)’ పేరుతో ఈ కారును బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఇదే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు.
WhatsApp and Meta: వాట్సాప్, మెటా సంస్థల కీలక ఉద్యోగులు రాజీనామా.. ఇద్దరూ భారతీయులే
ప్రారంభోత్సవ ఆఫర్ కింద దీని ధరను రూ.4.79 లక్షలు (ఎక్స్ షో రూం)గా నిర్ణయించారు. ఈ ధర మొదటి 10,000 మంది కస్టమర్లకే ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ కారుకు 6,000 బుకింగ్స్ జరిగినట్లు సంస్థ తెలిపింది. రూ.2,000 చెల్లించి సంస్థ వెబ్సైట్ ద్వారా కార్ బుకింగ్ చేసుకోవచ్చు. ‘ఈస్-ఈ’ తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు… చిన్న కారు కూడా. ఇది నానో కారు తరహాలో చిన్న సైజ్‌లో ఉంటుంది. ఈ కారు 2,915 మిల్లీమీటర్ల పొడవు, 1,157 మిల్లీమీటర్ల వెడల్పు కలిగి ఉంది. దీని బరువు 550 కిలోలు.
ఈ కారులో ఇద్దరు పెద్దవాళ్లు, ఒక కిడ్ మాత్రమే కూర్చుని ప్రయాణించవచ్చు. కారులో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, ఎయిర్ బ్యాగ్స్, క్రుయిజ్ కంట్రోల్, సీట్ బెల్ట్స్, బ్లూటూత్ వంటి ఫీచర్లున్నాయి. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.