Delhi Govt Online Yoga : కోవిడ్ బాధితుల‌ కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు

క‌రోనా బాధితుల‌ కోసం ఢిల్లీ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉచితంగా యోగా క్లాసులు అందిస్తోంది. బాధితులు తమ పేర్లను రిజిస్ట్రర్ చేసుకోవాలని సీఎం కేజ్రీవాల్ సూచించారు.

Delhi Govt Online Yoga Classes For Covid Patients : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్ర‌భుత్వం కొవిడ్ బాధితుల‌ కోసం ఓ వినూత్న చర్యలు చేపడుతోంది. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న కోవిడి బాధితులు ఏమాత్రం ఆందోళన చెందకుండా మహమ్మారినుంచి త్వ‌ర‌గా కోలుకోవాలనే ఉద్ధేశంతో వినూత్న అంశాల‌పై దృష్టి సారించింది.

Read more : India Capital : దేశ రాజధానిలో క‌రోనా టెర్ర‌ర్‌.. 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు

హోం ఐసోలేష‌న్‌లో ఉన్న కోవిడ్ బాధితుల‌ కోసం జ‌న‌వ‌రి 12వ నుంచి ఆన్‌లైన్‌లో యోగా క్లాసుల‌ను అందించనుందని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అధికారికంగా మంగ‌ళ‌వారం (జనవరి 11,2022) ప్ర‌క‌టించారు. కోవిడ్ క్లాసుల కోసం కొవిడ్ బాధితులు తమ పేరును రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించారు. బుధ‌వారం (జనవరి 12,2022) నుంచి ఉద‌యం, సాయంత్రం గంట చొప్పున‌ యోగా నిపుణులు.. ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వ‌హిస్తార‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

15 మందికి క‌లిపి ఒక క్లాస్ నిర్వ‌హిస్తారని..కోవిడ్ బాధితులు యోగా నిపుణుల‌తో మాట్లాడి త‌మ సందేహాల‌ను క్లియర్ చేసుకోవచ్చని సూచించారు. యోగా, ప్రాణాయామం చేయ‌డం ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చ‌ని..ఈ యోగా త‌ర‌గ‌తులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న 40 వేల మందికి ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయని తెలిపారు.యోగాలో ప్రత్యేక శిక్షణ పొందినవారు ఈ యోగా క్లాసులు చెబుతారని..రోగులు ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య లేదా సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల మధ్య స్లాట్‌లను ఎంచుకోవచ్చని సూచించారు.
Read more : Delhi’s Covid Cases : కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతున్న ఢిల్లీ

ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ తెలిపారు. నిన్న ఒక్క రోజే 19 వేల కేసులు న‌మోదు అయ్యాయి. ఆదివారం ఆ రాష్ట్రంలో 22 వేలు న‌మోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు