India Capital : దేశ రాజధానిలో క‌రోనా టెర్ర‌ర్‌.. 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు

కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

India Capital : దేశ రాజధానిలో క‌రోనా టెర్ర‌ర్‌.. 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు

India Capital

India Capital : కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. శనివారం ఢిల్లీలో 20,181 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 24 గంటల్లో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో 48,178 కేసులు యాక్టీవ్‌గా ఉండ‌గా, 24 గంట‌ల్లో 11,869 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 25,143 మంది క‌రోనాతో మృతిచెందారు.

చదవండి : Delhi’s Covid Cases : కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతున్న ఢిల్లీ

ఢిల్లీలో పాజిటివిటీ రేటు 19.6 శాతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. నైట్ క‌ర్ఫ్యూతో పాటుగా ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. శ‌ని, ఆదివారాల్లో కంప్లీట్‌గా క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. కరోనా సోకిన వారిలో చాలామందికి మైల్డ్ సింటమ్స్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకినవారిలో 5 శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వస్తోందని.. మిగతా వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇక ఐసీయూ వెళ్లే పరిస్థితి చాలా తక్కువ మందిలో వస్తోందని అధికారులు తెలిపారు.

చదవండి : Delhi Police : బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త అరెస్టు…