Delhi Police : బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త అరెస్టు…

మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా బుల్లి బాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో తీవ్ర కలకలం సృష్టించాయి...

Delhi Police : బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త అరెస్టు…

Bulli Bai App

Delhi Police Bulli Bai App Case : బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. బుల్లి బాయ్ యాప్ ద్వారా.. చాలా మంది ముస్లిం యువతులు, మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా బుల్లి బాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చింది. జనవరి 1న దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : Life Sentence : 12 మంది బాలికలపై అత్యాచారం చేసిన యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

అస్సాంలోని దిగంబర్ జొర్హట్‌కు చెందిన నీరజ్ బిష్ణోయ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. భోపాల్‌లోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అతను ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు అస్సాంలోని జొర్హట్‌లో నీరజ్‌ను అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఓ డివైజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read More : PM Modi Security : మోదీ కాన్వాయ్ భద్రతా వైఫల్యం..సుప్రీం విచారణ..తీర్పుపై ఉత్కంఠ

ఆ డివైజ్ ద్వారానే బుల్లి బాయ్ యాప్ డెవలప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌ పరిధిలోని ఐఎఫ్ఎస్‌వో బృందం నీరజ్ బిష్ణోను అరెస్టు చేసిందని ఈ బృందం చీఫ్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. గిట్ హబ్‌లో బుల్లి యాప్ తయారీదారు ఆయనే అని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడు అతనేనని తెలిపారు.