Phone Blasted In Court : కోర్టులో పేలిన ఫోన్..పోరాటం చేస్తానంటున్న న్యాయవాది

లాయర్ కోర్టులో ఉండగా అతని జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి మంటలువచ్చి పేలిపోయింది. దీంతో ఆ లాయర్ ఆ ఫోన్ సంస్థపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

phone blasted in lawyer pocket in court court : ఎంత ఖరీదు పెట్టి కొన్నా ఒక్కోసారి ఫోన్లు పేలిపోతుంటాయి. ఆ పేలేది ఇంట్లోనా..ఆఫీసులోనా లేక సాక్షాత్తు న్యాయస్థానంలోనే అనేది పేలిపోయే ఆ ఫోన్లకు తెలీదు కదా..అలా ఓ లాయర్ ఓ కేసు గురించి కోర్టుకు హాజరయ్యాడు. సీరియస్ గా విచారణ జరుగున్న సమయంలో ఆయన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ ఢాం అని పేలిపోయింది. దీంతో ఆ ఓ లాయర్ కు గయాలయ్యాయి. దీంతో ఆ లాయర్ ఆ ఫోన్ సంస్థపై న్యాయపోరాటం చేస్తానంటున్నారు.

Bluetooth Earphone : బాబోయ్.. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలి యువకుడు మృతి

అది దేశ రాజధాని ఉత్తర ఢిల్లీలోని హజారీ కోర్టు. కోర్టులో ఓ కేసు గురించి విచారణ జరుగుతోంది. అదే సమయంలో న్యాయవాది గౌరవ్ గులాటి జేబులో ఉన్న వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ నుంచి మంటలు చెలరేగాయి. అది గమనించిన గౌరవ్ వెంటనే ఫోన్ తీసి కింద పారేశాడు. ఆ వెంటనే కొన్ని క్షణాల్లోనే ఢాం అని శబ్ధం చేస్తూ పేలిపోయింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గౌరవ్ ఇటీవలే ఆ ఫోన్ కొన్నారు. ఎంతోకాలం అవ్వలేదు.

Read more : China : బ్యాగులో ఉన్న ఫోన్ పేలి..మంటలు, వైరల్ వీడియో

ఈ ఘటనపై కాసేపటికి తేరుకున్న న్యాయవాది గులాటి మాట్లాడుతూ.. నేను వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ ఇటీవలే కొన్నాను. కానీ అది పేలిపోయింది. కానీ వన్‌ప్లస్ సంస్థను తాను సంప్రదించేది లేదు. కానీ..ఆ సంస్థపై నేరుగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. కాగా..ఈ ఘటనపై వన్‌ప్లస్ సంస్థ కూడా స్పందించింది. ఫోన్‌ను పరీక్షించకుండా పరిహారం చెల్లించలేమని వెల్లడించింది. ఫోన్ పేలిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి మేం న్యాయవాది గౌరవ్‌ను సంప్రదించామని కానీ ఆయన నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదని వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు