China : బ్యాగులో ఉన్న ఫోన్ పేలి..మంటలు, వైరల్ వీడియో

చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్ కు మంటలు అంటుకున్నాయి.

China : బ్యాగులో ఉన్న ఫోన్ పేలి..మంటలు, వైరల్ వీడియో

Phone

Phone Catches Fire : సెల్ ఫోన్..ప్రస్తుతం ప్రతొక్కరి చేతిలో ఉంది. కుటుంబసభ్యులు ఎంత మంది ఉంటే..అంతమందికి సెల్ ఫోన్లు ఉంటున్నాయి. కానీ..అప్పుడప్పుడు వీటి వల్ల ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడు..మాట్లాడుతున్న సమయంలో..అకస్మాత్తుగా పేలుతున్నాయి. వీటివల్ల ప్రాణనష్టం కూడా సంభవిస్తుంటుంది. చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది.

నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్ కు మంటలు అంటుకున్నాయి. అతను వేసుకున్న టీ షర్ట్ కు మంటలు అంటకముందే..ఆ బ్యాగ్ ను కింద పడేశాడు. అక్కడున్న జనం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు బుధవారం దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 51 సెకన్ల గల ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు ఫోన్ ఎలా పేలిందబ్బా..అంటూ కొశ్చెన్స్ వేస్తున్నారు. పేలిన సెల్ ఫోన్ శాంసంగ్ కంపెనీదని, 2016లో దీనిని అతను కొనుగోలు చేసినట్లు, చాలా రోజుల నుంచి బ్యాటరీతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Read More : Vaccine Registrations : 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్..ఏప్రిల్ 24 నుంచి రిజిస్ట్రేషన్…ఎలా చేసుకోవాలి