Delhi Pollution..Schools Closed: ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..మరోసారి స్కూల్స్ మూసివేత..

ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..దీంతో మరోసారి స్కూల్స్ మూసివేయక తప్పటంలేదని పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రకటించారు.

Delhi Schools Closed Once again :  : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏమాత్రం తగ్గటంలేదు సరికదా రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో మరోసారి స్కూల్స్ మూసి వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. గురువారం (డిసెంబర్ 2,2021) కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. కాలుష్య నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తరువాత ఆదేశాలు జారీ చేసే వరకు స్కూల్స్ అన్నీ మూసే ఉంటాయని పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రకటించారు. ఢిల్లీలో వాయుకాలుష్యంలో ఏమాత్రంమెరుగుదల కనిపించడం లేదని..దీంతో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్స్ మూసివేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.

Read more : త‌మాషాలు చేస్తున్నారా..? ఢిల్లీ పొల్యూషన్‏పై సుప్రీం ఆగ్రహం 

ప్రభుత్వ గుర్తింపు పొందిన..న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (NDMC), మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఢిల్లీ కటోన్మెంట్‌ బోర్డ్‌లోని అన్ని స్కూల్స్ మూసివేయాలని ఆదేశించారు. కాగా కాలుష్యం తీవ్రమైన క్రమంలో ఇంతకు ముందు కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం మూసివేసిన విషయం తెలిసిందే. బోర్డుకు సంబంధించిన పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు నడుస్తాయని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తెలిపారు.

ఢిల్లీతో ఇటీవల రెండు మూడు రోజులు కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. కాలుష్య తీవ్రస్థాయికి చేరుకోవటంతో పక్కన ఉన్న మనిషి కూడా కనిపించనంతగా మారిపోతోంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఐఎస్‌బీటీలో గాలి నాణ్యత సూచీ (AQI) గురువారం ఉదయం 9 గంటలకు తీవ్ర కేటగిరిలో 448గా నమోదైంది. శీతాకాలం నేపథ్యంలో పొగమంచు పేరుకుపోయింది. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలకు పట్టపగలు లైట్లు వేసుకున్నా కనిపించే పరిస్థితి లేకుండాపోయింది.

Read more : Supreme Court : వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

 

ట్రెండింగ్ వార్తలు