Supreme Court : వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తీవ్రంగా ఉన్నా స్కూల్స్ తెరవడంపై ఫైర్ అయింది.

Supreme Court : వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court

Supreme Court outraged over pollution : వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తీవ్రంగా ఉన్నా…స్కూల్స్ తెరవడంపై ఫైర్ అయింది. పెద్దలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ…పిల్లలను స్కూల్ కు పంపుతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు స్కూల్స్ ఎందుకు తెరిచారని ప్రశ్నించింది. కాలుష్యంపై ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు కేంద్రంతోపాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉంది. ఎన్ సీఆర్ రీజియన్ లో కాలుష్య నియంత్రణకు సుమారు పదిహేను రోజులుగా యూపీ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ చర్యలు తీసుకుంటున్పప్పటికి కూడా ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు అమలు పరుస్తున్నా..ఎయిల్ క్వాలిటీ ఇండెక్స్ పై కాలుష్య తీవ్రత అన్నది 300 పాయింట్లుగా కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు… యథావిధిగా కాలుష్యం కొనసాగుతుందని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Trains Canceled : జొవాద్ తుపాను ఎఫెక్ట్..పలు రైళ్లు రద్దు

మరోవైపు సోమవారం నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడం పట్ల ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దలు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగిస్తున్నప్పుడు పిల్లలను బలవంతంగా ఏవిధంగా స్కూల్స్ రప్పిస్తారు, కాలుష్యంతో చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అని ఢిల్లీ ప్రభుత్వ చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే కేంద్రం తరపున సొలిటరీ జనరల్ తుషార్ మెహతా కాలుష్య నియంత్రణకు 24 గంటలు పని చేస్తున్నాం, రాష్ట్రాలతో కలిపి కాలుష్యాన్ని కలుగుచేస్తున్న పరిశ్రమలను మూసివేస్తున్నాం అన్న అంశాన్ని సుప్రీంకోర్టుకు తెలియపర్చినప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రతి రోజు కూడా కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

CM Jagan : ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

ప్రతి ఏడాది వింటర్ సీజన్ లో కాలుష్య ప్రభావం పెరుగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యలకు గురవుతూ యథావిధిగానే ఈ సంవత్సరం కూడా కాలుష్య బారిన పడి ఇబ్బందులు పడుతున్న తరుణంలో సుప్రీంకోర్టు…17 ఏళ్ల విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు సేకరించి,…వరుసుగా ఈ విచారణ కొనసాగిస్తూ వస్తోంది.

ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాల్లో అమలు పర్చాలని చెబుతూనే ఎప్పటికప్పుడు..కాలుష్య తీవ్రత ఏ విధంగా ఉందన్న అంశాలపై పట్ల కేంద్ర, రాష్ట్రాలను ప్రశ్నిస్తూవస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఏమైనా అత్యవసర ఉత్తర్వులు ఇస్తుందా అన్నది వేచి చూడాలి.