Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు షిండే, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేస్తారనే దానిపైనే ‘మహా’ రాజకీయం ఆధారపడి ఉంది.

Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

తాజా సమాచారం ప్రకారం శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉద్ధవ్ రాజీనామా చేసిన వెంటనే ముంబైలోని తాజ్ ప్రెసిడెంట్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరిగింది. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు అందరినీ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాకరే రాజీనామా మాకు సంతోషాన్నివ్వలేదు – రెబల్ ఎమ్మెల్యే

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఉన్న పెద్ద పార్టీ బీజేపీనే. తదుపరి కార్యాచరణపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని ఇప్పటికే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు అంటున్నారు. ఫడ్నవీస్, బీజేపీ నాయకత్వం షిండేతో సమావేశమై భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తారు. తర్వాత గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరుతారు.

ట్రెండింగ్ వార్తలు