Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాకరే రాజీనామా మాకు సంతోషాన్నివ్వలేదు – రెబల్ ఎమ్మెల్యే

మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాకరే రాజీనామా చేయడం మాకు సంతోషాన్నివ్వలేదని ఏక్‌నాథ్ షిండే శిబిరంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోవడమే ఈ చీలిక అని సూచించారు.

Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాకరే రాజీనామా మాకు సంతోషాన్నివ్వలేదు – రెబల్ ఎమ్మెల్యే

Uddhav Thackeray (1)

Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాకరే రాజీనామా చేయడం మాకు సంతోషాన్నివ్వలేదని ఏక్‌నాథ్ షిండే శిబిరంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు. శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోవడమే ఈ చీలిక అని సూచించారు.

దీపక్ కేసర్కర్ మాట్లాడుతూ, “మేం సూచించిన అంశాలను ఉద్ధవ్ ఠాక్రే పట్టించుకోలేదు. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతోనే కాదు మా నాయకుడిపైనా కూడా కోపం తెచ్చుకున్నందుకు బాధపడ్డాం. దీనంతటికి కారణం సంజయ్ రౌత్, ఎన్సీపీ మాత్రమే. ప్రతిరోజూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపైనా స్టేట్మెంట్లు ఇవ్వడం. ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుండటమే” అని పేర్కొన్నారు.

సైద్ధాంతికంగా ప్రతికూలమైన కాంగ్రెస్, ఎన్‌సీపీతో “అసహజ” పొత్తును విరమించుకోవాలని.. బీజేపీతో తిరిగి కలవాలని కోరుకుంటున్నారని షిండే వెల్లడించింది.

Read Also : అదే షిండేకు ఆయుధంగా మారిందా?శివసేనలో తిరుగుబాటుకు అదే కారణమైందా?

ఎనిమిది రోజుల రాజకీయ గందరగోళం తరువాత, గవర్నర్ ఆదేశించినట్లుగానే జరిగింది. గురువారం తన ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఠాకరే ఈ సాయంత్రం తన పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజీనామా సమర్పించారు.

ఠాకరే రాజీనామాతో బలపరీక్ష రద్దయింది. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్లెయిమ్ చేసే అవకాశం ఉందని, మిస్టర్ షిండే అతని డిప్యూటీగా ఉంటారని వర్గాలు తెలిపాయి.