Deyyamtho Sahajeevanam : నట్టి కరుణ హీరోయిన్‌గా ‘దెయ్యంతో సహజీవనం’..

నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి నిర్మిస్తున్న చిత్రం ‘DSJ (దెయ్యంతో సహజీవనం…)’

Deyyamtho Sahajeevanam : నట్టి కరుణ హీరోయిన్‌గా ‘దెయ్యంతో సహజీవనం’..

Deyyamtho Sahajeevanam Movie Shooting Completed

Updated On : June 11, 2021 / 1:54 PM IST

Deyyamtho Sahajeevanam: మంచి నాలెడ్జ్‌తో బాగా చదువుకుని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివేంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ (దెయ్యంతో సహజీవనం)’ నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ లేడీ ఓరియెంటెడ్‌గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి నిర్మిస్తున్న చిత్రం ‘DSJ (దెయ్యంతో సహజీవనం…)’ ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఈ నెల 12న ఈ చిత్రంలోని మొదటి పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ.. ‘‘లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా వచ్చాయి.. అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో నట్టి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది. నట్టి కరుణ ఆర్టిస్టుగానే కాకుండా గతంలో చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. డైనమిక్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ చిత్రంలోని నటీనటులందరూ చాలా బాగా నటించారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్‌గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్‌లో సుపూర్ణ మాలకర్ నటించారు. కరోనా టైంలో కూడా ఏంతో ధైర్యంగా కాశ్మీ‌ర్‌లోని అందమైన లోకేషన్స్‌లలో చిత్రీకరణ జరిపాం. అందరూ బాగా సహకరించడం వల్ల సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చెయ్యబోతున్నాం. ‘DSJ (దెయ్యంతో సహజీవనం)’ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది’’ అన్నారు..

చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ.. ‘‘నేను దర్శకత్వం వహించే ఈ ‘DSJ (దెయ్యంతో సహ జీవనం)’ చిత్రానికి నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్‌గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు వేరే సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూ డేట్స్ అడ్జెస్ట్ కాకున్నా ఈ సినిమా షూట్‌లో ఎక్కువగా సింగిల్ టేక్స్‌లో నటించినందుకు గర్వంతో పాటు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తన నటనను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్‌వ్యూలో చూశాను. కరోనా టైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వల్లే ఈ సినిమా పూర్తి చేయగలిగాం. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్‌కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.