srilanka crisis: శ్రీ‌లంక‌లో భార‌తీయ అధికారిపై దాడి

తీవ్ర ఆర్థిక, ఆహార‌ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంకలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. శ్రీ‌లంక అధ్య‌క్షుడి ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా చేసినప్ప‌టికీ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు కొన‌సాగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా, కొలంబోకు స‌మీపంలో ఓ భారతీయ అధికారిపై దాడి జ‌రిగింది. వీసా కేంద్రం డైరెక్టర్ వివేక్‌ వర్మపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. దీంతో వివేక్ వ‌ర్మ‌ తీవ్రంగా గాయపడ్డారు.

Vivek

srilanka crisis: తీవ్ర ఆర్థిక, ఆహార‌ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంకలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. శ్రీ‌లంక అధ్య‌క్షుడి ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స రాజీనామా చేసినప్ప‌టికీ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు కొన‌సాగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా, కొలంబోకు స‌మీపంలో ఓ భారతీయ అధికారిపై దాడి జ‌రిగింది. వీసా కేంద్రం డైరెక్టర్ వివేక్‌ వర్మపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. దీంతో వివేక్ వ‌ర్మ‌ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విష‌యాన్ని తెలుపుతూ భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. వివేక్ వ‌ర్మ‌పై దాడి జ‌రిగిన‌ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశామ‌ని తెలిపింది. శ్రీ‌లంక‌లో ఉంటోన్న‌ భారతీయులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ప్రస్తుత పరిస్థితిలో శ్రీలంకలోని భారతీయులు తాజా పరిణమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది. అత్యవసర సమయాల్లో తమను సంప్రదించవచ్చని తెలిపింది. ఇరు దేశాల ప్రజల మద్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని మరో ట్వీట్‌లో పేర్కొంది.

శ్రీలంకలోని భారతీయులు ఆ దేశంలోని ప‌రిస్థితుల‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా మెల‌గాల‌ని సూచించింది. అత్యవసర సమయాల్లో తమను సంప్రదించాల‌ని పేర్కొంది. భార‌త్-శ్రీ‌లంక మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని చెప్పింది. శ్రీ‌లంక‌లో మ‌రోసారి ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. కాగా, శ్రీ‌లంక‌లో నేడు కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌త‌ను పెంచారు.

Armed Forces: ఐదేళ్లలో 819 మంది సైనికుల ఆత్మహత్య: కేంద్రం