Armed Forces: ఐదేళ్లలో 819 మంది సైనికుల ఆత్మహత్య: కేంద్రం

గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.

Armed Forces: ఐదేళ్లలో 819 మంది సైనికుల ఆత్మహత్య: కేంద్రం

Armed Forces

Updated On : July 19, 2022 / 8:02 PM IST

Armed Forces: గడచిన ఐదేళ్లలో దేశంలో 819 మంది సైనికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కేంద్రం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. ఆర్మీలో 642 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఒత్తిడి, ఆత్మహత్యలకు సంబంధించి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే సిబ్బందిని గుర్తించి, వారికి కమాండింగ్ ఆఫీసర్స్, రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్స్, జూనియర్ లీడర్స్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సెలవులు ముగించుకుని వచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా కౌన్సెలింగ్ అందిస్తున్నారు. అనేక స్థాయిల్లో ఒత్తిడిని గుర్తించి, తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మీలోని 23 సైకియాట్రిక్ సెంటర్లలో ప్రత్యేక శిక్షణ పొందిన సైకియాట్రిస్టులు సేవలు అందిస్తున్నారు.