Mamata Banerjee: నిధుల కోసం మీ కాళ్ల మీద పడి అడుక్కోవాలా: కేంద్రానికి మమత ప్రశ్న

తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రం కాళ్ల మీద పడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నిధులు విడుదల చేయకపోవడంపై కేంద్రంపై మమత విమర్శలు చేశారు.

Mamata Banerjee: రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రం కాళ్ల మీద పడాలా అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జీఎస్టీ కేటాయింపులతోపాటు, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

InSight lander: ‘ఇక నా పని అయిపోయింది’.. మార్స్‌ నుంచి సందేశం పంపిన ఇన్‌సైట్ ల్యాండర్

పశ్చిమ బెంగాల్, జర్‌గ్రామ్‌లో జరిగిన భగవాన్ బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు చేశారు. ‘‘వంద రోజుల ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేయడం తప్పనిసరి. ఏడాదికిందే దీని గురించి మోదీని అడిగాను. అయినా నిధులు రాలేదు. నేను మీ కాళ్ల మీద పడి అడుక్కోవాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక ఒకే పార్టీ పాలనలో ఉన్నామా? మాకు రావాల్సిన నిధులు ఇవ్వండి. అది మా డబ్బు. లేదంటే జీఎస్టీనే రద్దు చేస్తాం. మీరు వంద రోజుల ఉపాధి హామీ నిధులైనా ఇవ్వండి. లేదా మీ కుర్చీ (పదవి)నైనా వదులుకోండి.

Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

వాళ్లు మాకు నిధులు ఇవ్వం అని బెదిరిస్తున్నారు. ఇలా చేస్తే మేమూ జీఎస్టీని రద్దు చేస్తాం. మాకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇక్కడి నుంచి పన్నులు వసూలు చేసుకోలేరు’’ అని మమత వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ నిధుల్ని కేంద్రం ఇవ్వడం లేదని, దీనిపై గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని మమత పిలుపునిచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు