Doctor dies: బిల్డింగ్‌పై నుంచి పడి డాక్టర్ మృతి
నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బిల్డింగ్‌పై నుంచి పడి డాక్టర్ మరణించిన ఘటన అసోంలో జరిగింది. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కోసం బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది.
- Narender Thiru
- Published On : June 9, 2022 / 09:12 AM IST
Doctor Dies
Doctor dies: నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి బిల్డింగ్‌పై నుంచి పడి డాక్టర్ మరణించిన ఘటన అసోంలో జరిగింది. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కోసం బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. బుధవారం రోజు కార్మికులు నిర్మాణ పనుల్లోఉండగా, ఉన్నట్లుండి పెద్ద శబ్దం వినబడింది. వెంటనే కార్మికులు వెళ్లి చూడగా, డాక్టర్ ఏడంతస్తుల బిల్డింగ్ పైనుంచి పడినట్లుగా గుర్తించారు. అప్పటికే రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న డాక్టర్‌ను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
Lawrence Bishnoi: సిద్ధూ హత్య.. లారెన్స్ బిష్ణోయే సూత్రధారి
డాక్టర్‌ను ఫాల్గు ప్రతీమ్ దాసుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఎయిమ్స్ బిల్డింగ్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతోంది. అయితే, బిల్డింగ్‌లో వైద్య విద్యార్థులకు క్లాసులు మాత్రం నిర్వహిస్తున్నారు.
