Lawrence Bishnoi: సిద్ధూ హత్య.. లారెన్స్ బిష్ణోయే సూత్రధారి

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు.

Lawrence Bishnoi: సిద్ధూ హత్య.. లారెన్స్ బిష్ణోయే సూత్రధారి

Lawrence Bishnoi

Lawrence Bishnoi: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు. సిద్ధూ గత నెల 29న హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య తర్వాత సిద్ధూను చంపించింది తామేనని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించారు. ఇండియాలో దీని వెనుక ఉన్నది లారెన్స్ బిష్ణోయ్ అని తెలిపాడు. దీంతో తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా ముందుగా సిద్ధూ హత్యతో తనకేం సంబంధం లేదని బిష్ణోయ్ చెప్పినా, తర్వాత అతడే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పంజాబ్ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Pawan Kalyan: పవన్ ఆ టాపిక్ టచ్ చేస్తాడా..?

సిద్ధూ హత్యలో ఐదుగురు షూటర్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీరిలో సిద్ధేష్ హీరామన్ కామ్లే అలియాస్ మహాకాల్ అనే షూటర్‌ను అరెస్టు చేశారు. మహాకాల్ ఈ హత్యలో ప్రధాన షూటర్‌కు అత్యంత సన్నిహితుడు. మహాకాల్ నేరుగా సిద్ధూను షూట్ చేయకపోయినా, హత్యకు సహకరించినట్లుగా తెలుస్తోంది. మహాకాల్‌ను పోలీసులు 14 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారని, త్వరలోనే ప్రధాన షూటర్లను పట్టుకుంటామని ధళివాలి తెలిపాడు.