Pawan Kalyan: పవన్ ఆ టాపిక్ టచ్ చేస్తాడా..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ రిలీజ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా, మలయాళ భామ....

Pawan Kalyan: పవన్ ఆ టాపిక్ టచ్ చేస్తాడా..?

Will Pawan Kalyan Touch That Point At Ante Sundaraniki Event

Pawan Kalyan: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ రిలీజ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా, మలయాళ భామ నజ్రియా నాజిమ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దగా, ఇవాళ(జూన్ 9) ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వస్తుండటంతో అందరి చూపులు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ పైనే ఉన్నాయి.

Ante Sundaraniki: అంటే సుందరానికీ పవర్ ఇస్తోన్న పవన్!

అయితే.. ఈ ఈవెంట్‌లో పవన్ ఏం మాట్లాడతాడు.. ఆయన ఏయే అంశాలను టచ్ చేస్తాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సమయంలో పవన్ ఏపీలో నెలకొన్న టికెట్ రేట్ల విషయంపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హీరో నాని కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించనుండటంతో, వీరు మరోసారి ఏపీ టికెట్ విషయాన్ని టచ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పవన్ మరోసారి ఈ టాపిక్‌ను టచ్ చేస్తే, జనం నుండి ఈసారి ఎలాంటి రియాక్షన్ వస్తుందా అనేది కూడా ఆసక్తిగా మారింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఆ స్టార్ బ్యూటీ తప్పుకుందా..?

కానీ.. ప్రస్తుతం పవన్ ఆ టాపిక్‌ను టచ్ చేయకపోవచ్చని.. కేవలం సినిమాలకు సంబంధించే మాట్లాడతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఏదేమైనా నాని సినిమా ఈవెంట్‌కు పవన్ వస్తున్నాడని తెలియగానే, అందరి చూపులు ఈ ఈవెంట్‌పై పడ్డాయి. మరి సుందరం వేడుకలో పవన్ ఏయే అంశాలు మాట్లాడతాడో చూడాలి. ఇక అంటే సుందరానికీ చిత్రాన్ని జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైన సంగతి తెలిసిందే.