Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఆ స్టార్ బ్యూటీ తప్పుకుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా....

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఆ స్టార్ బ్యూటీ తప్పుకుందా..?

Pooje Hegde Out Of Pawan Kalyan Bhavadheeyudu Bhagat Singh

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, హిస్టారికల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను ఓకే చేశాడు పవన్. అయితే ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర వర్గాల్లో ఓ టాక్ జోరుగా చక్కర్లు కొడుతోంది.

Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?

ఈ సినిమాలో పవన్ మరోసారి పవర్’ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో తొలిసారిగా పవన్ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా ఇటీవల చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కానీ.. ప్రస్తుతం ఈ సినిమా నుండి ఆమె తప్పుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

Bhavadeeyudu Bhagat Singh: ప్రొఫెసర్‌గా మారనున్న పవర్ స్టార్.. కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్!

దీంతో ఆమె భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమా నుండి ఆమె తప్పుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో పూజా స్థానంలో మరో స్టార్ బ్యూటీని తీసుకునేందుకు చిత్ర యూనిట్ కూడా రెడీ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు అటు పవన్, ఇటు హరీష్ శంకర్ ఇద్దరూ రెడీ అవుతున్నారట.