Story of a dog : 64 కిలోమీటర్లు.. 27 రోజులు రోడ్డుపై ఆ డాగ్ నడుస్తూనే ఉంది.. చివరికి ఎక్కడికి చేరింది?

కుక్క చాలా విశ్వాసం ఉన్న జంతువు. తనను నమ్మిన యజమానికి పట్ల ఎక్కడలేని అభిమానం చూపిస్తుంది. దత్తతకు వెళ్లిన ఓ డాగ్ అక్కడ ఉండలేక తన యజయాని దగ్గరకు చేరడానికి ఎంత కష్టపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Story of a dog : జంతువుల పట్ల మనుష్యులే కాదు.. అవి కూడా యజమానులపై విపరీతంగా అభిమానం పెంచుకుంటాయి. వారిని విడిచి ఉండటానికి కూడా ఇష్టపడవు. ఓ డాగ్ 64 కిలోమీటర్లు 27 రోజులు నడిచి తన యజమానికి చేరుకుంది.

Odisha : ఒడిశాలో గిరిజన తెగ వింత ఆచారం.. దుష్టశక్తులు దరిచేరకుండా చిన్నారులకు వీధి కుక్కలతో వివాహం

కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు. కూపర్ అనే డాగ్ అదే విషయాన్ని స్పష్టం చేసింది. దాని యజమానులు వేరే కుటుంబానికి దానిని దత్తత ఇచ్చారు. దాంతో అది ఉత్తర ఐర్లాండ్ లోని కౌంటీ టైరోన్‌నికి వెళ్లాల్సి వచ్చింది. కొత్త వారి దగ్గరకు వచ్చిందే కానీ ఒక్క క్షణం అక్కడ దాని కాలు నిలువలేదు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసింది.

 

తన అసలు యజమాని దగ్గరకు వెళ్లడానికి నెలరోజులపాటు రోడ్డుపైనే నడిచింది. కాలి నడకన 40 మైళ్లు అంటే సుమారు 64 కిలోమీటర్లు నడిచింది. సమయానికి దానికి ఫుడ్ ఇచ్చేవారు కూడా లేరు. ఓ వైపు దత్తత తీసుకున్న కుటుంబం.. మరోవైపు అసలు యజమానులు దాని కోసం వెతుకులాట మొదలుపెట్టారు. Lost Paws NI అనే స్వచ్ఛంద సంస్థని సైతం ఆశ్రయించారు. వారి శ్రమ ఫలించి కూపర్‌ కనిపెట్టగలిగారు. కూపర్ రోడ్లు, అడవులు, పొలాలు అన్నీ దాటి మొత్తానికి ఇంటికి వచ్చింది.

A kind dog : ఈ డాగ్‌ను చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.. పిల్లి కోసం ఏం చేసిందంటే?

Lost Paws NI అనే సంస్థ తప్పిపోయిన జంతువుల్ని తమవారికి చేర్చేందుకు పని చేస్తుంది. ఈ స్టోరిని స్వయంగా ఈ సంస్థ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయడంతో చాలామంది నెటిజన్లు వీక్షించారు. ‘కూపర్ క్షేమంగా ఇంటికి చేరినందుకు సంతోషంగా ఉందని’ కొందరు ‘కూపర్ అద్భుతమైన డాగ్.. దానిని వేరే వారికి ఇవ్వడానికి యజమానికి మనసు ఎలా ఒప్పిందని?’ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు