A kind dog : ఈ డాగ్‌ను చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.. పిల్లి కోసం ఏం చేసిందంటే?

భిన్న జంతువుల మధ్య వైరం సహజమే. కానీ కొన్ని స్నేహంతో మెలుగుతాయి. ఓ పిల్లి కోసం డాగ్ పాలు రెడీ చేసి ఇవ్వడం చూసేవాళ్లకు భలే అనిపిస్తోంది.

A kind dog : ఈ డాగ్‌ను చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.. పిల్లి కోసం ఏం చేసిందంటే?

A kind dog

A kind dog :  ఇంటర్నెట్‌లో కొన్ని జంతువులు.. పక్షులు కలిసి ఆడుకుంటున్న వీడియోలు చూస్తే ముచ్చట వేస్తుంది. భిన్న జాతులకు చెందినవి అయినా వాటి మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తే భలే అనిపిస్తుంది. రీసెంట్‌గా ఓ డాగ్ … పిల్లికి పాలు స్వయంగా ప్రిపేర్ చేసి ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది.

Dog Saved owner Life : యజమాని వేలు కొరికేసిన కుక్క .. ప్రాణం కాపాడిన కుక్కకు అదే వేలును ఆహారంగా వేసిన యజమాని

ఓ డాగ్ బౌల్‌లో పాల పొడి వేసింది. ఒక చిన్న స్టిక్ తెచ్చి పాలు కలియతిప్పింది. ఆ పాలు వేడిగా ఉన్నాయేమే? అన్న అనుమానంతో హ్యాండ్ ఫ్యాన్‌తో చల్లారబెట్టింది. చల్లబడ్డాయని డిసైడ్ అయ్యాక బుట్టలో పడుకున్న పిల్లిని పాలు ఉన్న బౌల్ దగ్గర వదిలిపెట్టింది. ఆకలితో ఉన్న ఆ పిల్లి ఆ పాలని తాగుతుంటే ఆ డాగ్ దానివైపు ఆప్యాయంగా చూసింది. అచ్చంగా మనుష్యుల మాదిరిగా ప్రవర్తించిన ఆ డాగ్‌ని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘శత్రువులను సైతం కలిపే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది’ అనే శీర్షికతో adore_pankaj అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దీనిని పోస్ట్ చేశారు.

Delhi Airport : 17 కోట్ల విలువైన కోకైన్ తరలింపుకు కిలాడీ లేడీ స్కెచ్ .. పసికట్టి పట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్

ఈ వీడియో వారం రోజుల క్రితం పోస్ట్ చేస్తే లక్షల కొద్దీ జనం వీక్షించారు. ‘ప్రపంచానికి ఇలాంటి ప్రేమ, దయ అవసరం .. చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకునే మనుష్యులు ఈ జంతువుల నుంచి ఎంతో నేర్చుకోవాలని’ కామెంట్లు పెట్టారు. అయితే ఖచ్చితంగా ఈ డాగ్‌కి మాత్రం యజమానులు మంచి ట్రైనింగ్ ఇచ్చారని కూడా మెచ్చుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Animals Lover (@adore_pankaj)