Delhi Airport : 17 కోట్ల విలువైన కోకైన్ తరలింపుకు కిలాడీ లేడీ స్కెచ్ .. పసికట్టి పట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్

మద్యం బాటిల్ తెచ్చుకుంటున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కు అడ్డంగా చిక్కింది. కిలాడీ లేడీ అతి తెలివితేటల్ని సైతం బోల్తా కొట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కొకైన్ తరలింపును పట్టించింది.

Delhi Airport : 17 కోట్ల విలువైన కోకైన్ తరలింపుకు కిలాడీ లేడీ స్కెచ్ .. పసికట్టి పట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్

cocaine seized

Delhi Airport : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. డ్రగ్స్ తరలింపులపై అధికారులు డేగ కళ్లతో చెక్కింగులు చేస్తున్నా అక్రమ తరలింపులు కొనసాగుతునే ఉన్నాయి. దీంట్లో భాగంగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 17 కోట్ల విలువ చేసే కేజీ కోకైన్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. టాంజానియా లేడి కిలాడీ వద్ద కొకైన్ గుర్తించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్… కొకైన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ తరలింపులో ఎన్నో టెక్నిక్ లు ఫాలో అవుతున్నారు అక్రమార్కులు.

దీంట్లో భాగంగా కొకైన్ తరలించడానికి కొత్తగా స్కెచ్ వేసింది ఇథియోపియా ప్రయాణికురాలు. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం బాటిల్స్ లొ నింపి ఏదో మద్యం బాటిల్ తెచ్చుకుంటున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. అయినా కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కు అడ్డంగా చిక్కింది. కిలాడీ లేడీ అతి తెలివితేటల్ని సైతం బోల్తా కొట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కొకైన్ తరలింపును పట్టించింది.

విదేశాల నుండి ఓ ప్రయాణీకుడు 3 మద్యం బాటిల్స్ తీసుకొని వచ్చే వెసులుబాటు ఉంది రూల్ ప్రకారం. దీన్ని కొకైన్ తరలింపుకు ప్లాన్ గా వాడేసుకుందామనుకుంది ఇథియోపియా ప్రయాణీకులురాలు. మద్యం బాటల్స్ ను ఎవ్వరూ తనిఖీలు చేయరని కొకైన్ ను మద్యం బాటిల్స్ లో కలిపి తరలించే యత్నం చేసింది. కానీ డ్రగ్స్ వాసన పసిగట్టిన కస్టమ్స్ ట్రైనింగ్ డాగ్. మద్యం బాటిల్స్ ఉన్న కవర్ వద్దకు వచ్చి కూర్చొంది ఓ డాగ్. మద్యం బాటిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించింది. దీంతో ప్రయాణికురాలిని అరెస్టు చేసారు అధికారులు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.