Udaipur man idea : కారుని రెండు గాడిదలు లాగుతుంటే షోరూంకి తీసుకెళ్లాడు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు?

ఏదైనా ఖరీదైనా వస్తువు కొనేముందు ఎన్నో కలలు కంటాం. ఇక కష్టపడి కూడబెట్టిన డబ్బు అంతా దానికి ఖర్చు చేస్తాం. తీరా అది సరిగా పనిచేయకపోతే ఎంతో డీలా పడిపోతాం. కొత్త కారు సరిగా పనిచేయకపోవడంతో ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి.

Udaipur man idea

Udaipur man idea : లక్షలు పోసి కారు కొన్నాడు. తీరా అది కదలకుండా మొరాయించింది. షో రూం వాళ్లకి కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడంతో అతను ఏం చేశాడో చూడండి.

Kerala : కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్.. ‘తనయుడి జ్ఞాపకాలు సజీవం’గా ఉండాలని ఓ తండ్రి వినూత్న ఆలోచన

రాజస్థాన్ ఉదయ్‌పూర్ కి చెందిన శంకర్‌లాల్ అనే వ్యక్తి  మద్రి  ఇండస్ట్రియల్ ఏరియాలోని షోరూం నుండి రూ.17.5 లక్షల రూపాయలతో కొత్త కారును కొన్నాడు. కొన్నప్పటి నుంచి బ్రేక్‌లు సరిగా పడకపోవడం.. కారు స్టార్ట్ చేయడానికి చాలాసార్లు నెట్టాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు. రెండుసార్లు సర్వీస్ సెంటర్‌కు తీసుకువచ్చినప్పటికీ డీలర్ సరైన పరిష్కారం చూపించలేకపోయాడు. అసలే కొత్త కారు.. లక్షలు పోసి కొన్నాక ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఇక డీలర్ కూడా సరైన పరిష్కారం చూపించకపోవడంతో శంకర్‌లాల్ షోరూం వాళ్లకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన కారుకి రెండు గాడిదలను కట్టాడు. డ్రమ్ములు వాయిస్తుండగా కారును రెండు గాడిదలు లాగుతుంటే ఊరేగింపుగా షోరూంకి వెళ్లాడు. మధ్యలో కొందరు కారును నెట్టే విజువల్స్ కూడా కనిపిస్తాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Cow Dung coating car : డాక్టర్ గారి ఐడియా.. చల్లదనం కోసం కారుకి పేడ పూత

ఇంతలా వెళ్తే షోరూం యాజమాన్యం అవాక్కవ్వకుండా ఉంటుందా? బ్యాటరీ అవాంతరాల వల్లే ఈ పరిస్థితి అని బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే వరకూ ఉంచి కారును నడపాలని శంకర్ లాల్‌కి సూచించారట. అవేమీ శంకర్‌లాల్‌కి హెల్ప్ కాలేదు. ప్రస్తుతానికి కారు షోరూంలో ఉంది. తనకి దాన్ని సరిచేసైనా ఇవ్వాలి.. లేదంటే దాని ప్లేస్‌లో కొత్తదైనా ఇవ్వాలని శంకర్‌లాల్ భీష్మించుకుని కూర్చున్నాడు. మరి షోరూం యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ.. ఈ గాడిదల ఊరేగింపుతో షోరూంకి వెళ్లిన ఐడియాని చూసి జనం మాత్రం ఆశ్చర్యపోతున్నారు.