Cow Dung coating car : డాక్టర్ గారి ఐడియా.. చల్లదనం కోసం కారుకి పేడ పూత
పేడ పూత కారుతో రయ్ మంటూ దూసుకుపోతున్నారు ఓ డాక్టర్ గారు. ఎండ ఎంత ఉంటే ఏంటీ..నా కారుకు పేడ పూత ఉండగా అంటున్నారు.

Cow Dung coating car
Cow Dung coating car : వేసవికాలం. ఎండలు మండే కాలం. బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు జనాలు ఎండవేడికి తాళలేక. కారులో వెళితే కాస్త ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే కారులో ఏసీ ఉంటుంది కాబట్టి. కానీ కారులో ఏసీ లేకపోతే ఎలా? అంటే కారులో ఏసీ లేకపోతే ఎందుకు చింత..‘పేడ’ఉందిగా మన చెంత అంటున్నారు ఓ డాక్టర్ గారు..పేడేంటీ, వేడేంటీ, ఈ గోలేంటీ అంటే ఇది ఈ డాక్టర్ గారు పేడ పూత కథ తెలుసుకోవాల్సిందే..
మధ్యప్రదేశ్-ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యలో ఉండే బుందేల్‌ఖండ్‌లో ఓ హోమియోపతి డాక్టర్ ఉన్నారు. ఆయన ఎండవేడినుంచి తప్పించుకోవటానికి బ్రహ్మాండమైన ఐడియా ఉపయోగించారు. తన కారు చల్లగా ఉండటానికి ఆవుపేడతో పూత పూసాడు. అచ్చంగా పేడతో ఇల్లు అలుకుతాం కదా..అలా పేడతో కారు అంతా పూత పూసాడు. అబ్బా భలే చల్లగా ఉంది ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు డాక్టర్. ఇంత గొప్ప ఐడియా వేసిన డాక్టర్ పేరు సుశీల్ సాగర్. ఈ పేడ పూత పూసిన కారులో డాక్టర్ గారు వెళుతుంటే జనాలంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. కానీ ఆయనమాత్రం అవేవీ పట్టించుకోరు. నాకారు చల్లగా ఉంది సో నేను కూడా కూల్ గా ఉన్నానంటూ ఝామ్మంటూ పేడ కారులో దూసుకుపోతుంటారు బుందేల్ ఖండ్ రోడ్లపై..
ఆవు పేడను పూయడం వల్ల వేడి తగ్గుతుందని, లోపలి నుంచి చల్లగా ఉంటుందని డాక్టర్ సుశీల్ కుమార్ చెబుతున్నారు. డాక్టర్ సుశీల్ సాగర్ జరుఖేడా ఆరోగ్యసేత ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తుంటారు. ఆయన బుందేల్ ఖండ్ నగరంలోని తిలక్‌గంజ్ లో నివసిస్తుంటారు. ఆయన కారుకు పేడతో పూత పూసారు వేడి తగ్గించుకోవటానికి.
పేడ పూత వల్ల సూర్య కిరణాలు డైరెక్ట్ గా పడకుండా పేడ నిలువరిస్తుందని తద్వారా కారు చల్లగా ఉంటుందని చెబుతున్నారు. పేడ సూర్యకిరణాలను పీల్చేసుకుంటుంది. దీంతో కారులోపల వేడి లేకుండా చల్లగా ఉంటుందని చెబుతున్న డాక్టర్ మీరు కూడా ట్రై చేయిండి అని సూచిస్తున్నారు. ఎండలు మండిపోతుంటే డాక్టర్ గారు మాత్రం పేడపూత కారులో కూల్ కూల్ గా తిరిగేస్తున్నారు. ఈ పేడ పూత కారు సోషల్ మీడియాలో తెగ ఫుల్ వైరల్ గా మారింది. కాగా..అహ్మదాబాద్‌లో ఓ మహిళ కూడా తన కారుకు ఇలాగే పేడ కోటింగ్ వేసుకుంది. ఎండవేడి నుంచి తప్పించుకోవటమే కాకుండా కాలుష్యం నుంచి కూడా కాపాడుకోవచ్చని చెప్పిన ఆమె ఆమె కారు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అంతేమరి డిఫరెంట్ ఐడియాలు ఇలా వైరల్ అయిపోతుంటాయి..