×
Ad

Drugs suicides : మద్యం,మాదకద్రవ్యాల వల్ల గంటకో ఆత్మహత్య : క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక

మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై గంటకో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారని నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది.

  • Published On : November 16, 2021 / 11:24 AM IST

Drugs Suicides In India

Drugs suicides in India : భారత్ లో మద్యం, మాదక ద్రవ్యాలు అమ్మకాలు ఎన్నో కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. పండంటీ కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసలై రోగాలపాలై చనిపోయేవారు కొంతమంది అయితే వీటి మత్తులో పడి ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై గంటకో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారని నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది.

మత్తు పదార్థాలు, మనిషిపై ఎంతటి ప్రభావాం చూపిస్తాయో నార్కోటిక్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2020లో మద్యం, మాదకద్రవ్యాల కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవించిందని ఆ నివేదికలో పేర్కొంది. 2019తో పోల్చితే వ్యసనాల బారినపడి బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య 2020లో 17 శాతం ఎక్కువగా నమోదైంది. దీన్ని బట్టి చూస్తే మదకద్రవ్యాలు ఎంతటి దారుణాలకు ప్రేరేపిస్తున్నాయో..ఎన్ని కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Read more : రైతుల కన్నా ఎక్కువ : దేశంలో పెరిగిన నిరుద్యోగుల ఆత్మహత్యలు

ఇటువంటి ఘటనలు 2019లో 7,860 జరగ్గా, అదే 2020లో 9 వేల వరకు నమోదయ్యాయి. అంటే అంతకంతకు పెరుగుతున్నాయనే విషయం ప్రత్యక్ష్యంగా తెలుస్తోంది. మద్యానికి, మాదకద్రవ్యాలకు గురై ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య మహారాష్ట్ర, కర్ణాటకలు ఎక్కువగా నమోదయ్యారు. దేశంలో ఈ రెండు రాష్ట్రాలు ఇటువంటి ఘటనల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే 43 శాతం కేసులు నమోదయ్యాయి.

దీనిపైమ మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతూ, కుంగిపోయి ఆత్మహత్య చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటివారిని మద్యం, మాదకద్రవ్యాలు మరింత కుంగదీస్తున్నాయని..మత్తులో పడి..ఆందోళనలకు గురికావటం..అనారోగ్యం పాలు కావటం తద్వారా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని తెలిపారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వారిలో ఉన్న వేదనను కూడా డ్రగ్స్, మద్యం మరింతగా పెంచుతాయని వెల్లడించారు.

Read more : Suicide : పండుగకు వస్తానన్న కొడుకు రాలేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

2019లో దేశవ్యాప్తంగా జరిగిన 1.3 లక్షల ఆత్మహత్యల్లో 5.6 శాతం మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిసలైనవారే ఎక్కువ శాతంమంది ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోవెల్లడించింది. 2020లో నమోదు అయిన ఆత్మహత్యల్లో 6శాతం ఇటువంటి కేసులే ఉన్నాయని తెలిపింది.