Suicide : పండుగకు వస్తానన్న కొడుకు రాలేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

పండుగకు వస్తానన్న కొడుకు రాలేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని అమీర్ పేటలో చోటుచేసుకుంది.

Suicide : పండుగకు వస్తానన్న కొడుకు రాలేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

Mother Suicide In Ameerpet

Updated On : November 13, 2021 / 5:19 PM IST

Mother suicide in ameerpet హైదరాబాద్ నగరంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. దీపావళి పండుగకు కొడుకు కోడలు వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసింది. వస్తానని అని చెప్పిన కొడుకు రాకపోయేసరికి ఆవేదన చెందింది. వేయి కళ్లతో ఎదురు చూసినా కొడుకు రాకపోవటంతో మనస్తాపానికి గురైన తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఎస్సార్‌నగర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్‌కాలనీకి చెందిన దండ బుచ్చిబాబు, సుజాత కుమారుడు యోగకు గత ఆగస్టులో వివాహమైంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అయిన కుమారుడు, కోడలు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు.

ఈ క్రమంలో దీపావళికి రావాలని సుజాత కొడుకుని కోడల్ని తీసుకుని దీపావళి పండుగకు రావాలని అడిగింది.దానికి కొడుకు సెలవు లేవు..వీలుపడితే వస్తానని చెప్పాడు. కానీ కొడుకు వస్తాడని ఆశతో ఎదురు చూసింది. కానీ కొడుకు రాలేదు.దీంతో సుజాత మనస్తాపానికి గురి అయ్యింది. అప్పటినుంచి ముభావంగానే ఉండేది.

ఈ క్రమంలో గత గురువారం (నవంబర్ 11,2021)తెల్లవారుజామున ఉరి వేసుకుని చనిపోయింది. సుజాత చనిపోవటం భర్తకు తెలియదు. ఎందుకంటే ఆయన పెంట్‌హౌస్‌లో నిద్రపోగా..సుజాత కింది అంతస్తులో రూమలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారిన తరువాత కిందికి వచ్చిన భర్తకు ఇంట్లో ఎటువంటి అలికిడి లేకపోవటంతో ఆందోళన చెందాడు. గబగబా రూమ్ లోకి వెళ్లి చూడగా..ఫాన్ కు ఉరి వేసుకుని కనపించటంతో షాక్ అయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.