Earthquake: రాజస్థాన్ బికనేర్‌లో భూకంపం..భయాందోళనల్లో జనం

ఉత్తర భారతదేశంలో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నగర ప్రాంతంలో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు...

Earthquake

Earthquake hit Bikaner: రాజస్థాన్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. బికనేర్ నగర ప్రాంతంలో మంగళవారం రాత్రి 11.36 గంటలకు సంభవించిన భూకంపంతో ఇళ్లలో నిద్రపోతున్న జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. బికనేర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది.

Cyclone Biparjoy : పాకిస్థాన్‌లో తీరం దాటనున్న బీపర్‌జోయ్ తుపాన్…పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

ఉత్తరభారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని రాజస్థాన్ అధికారులు చెప్పారు.జమ్మూ కశ్మీర్, అసోం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.