Sonia Gandhi
Sonia Gandhi: నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఇప్పటికే సోనియా గాంధీకి ఈడీ పలుసార్లు సమన్లు పంపగా కరోనా, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆమె హాజరు కాలేదు. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈడీ మరోసారి సమన్లు పంపింది.
salt: అదనంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మరణ ముప్పు
ఇప్పటికే ఇదే కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. రాహుల్ ను ఈడీ దాదాపు ఐదు రోజుల పాటు విచారించింది. ఆయన చెప్పిన సమాధానాలను రికార్డు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను విచారణకు పిలిచి గంటల కొద్దీ ప్రశ్నించారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళన తెలిపారు.