Enforcement Directorate Raids in Hyderabad: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నారు. 25 బృందాలుగా ఏర్పడిన ఢిల్లీ ఈడీ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే.

Enforcement Directorate Raids in Hyderabad: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నారు. 25 బృందాలుగా ఏర్పడిన ఢిల్లీ ఈడీ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లోని రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఆఫీసులు, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ లోని​బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్​గా అభిషేక్ రావు ఉన్నట్లు తెలిసింది. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈ-మెయిల్ అడ్రస్ కూడా ఒకటేనని ఈడీ దర్యాప్తులో తేలింది.

మరోవైపు, కోకాపేట్​లోని రాంచంద్ర పిళ్లై ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రద్దుచేసి, పాత విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని పలువురి ప్రముఖుల పేర్లు ఈ కుంభకోణంలో ఉండడంతో వారిలో వణుకు పుడుతోంది.

Bihar Passengers: ప్రయాణికులకు దొరికిపోయి… 10 కి.మీటర్లు రైలు కిటికీకి వేలాడిన దొంగ.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు