Bihar Passengers: ప్రయాణికులకు దొరికిపోయి… 10 కి.మీటర్లు రైలు కిటికీకి వేలాడిన దొంగ.. వీడియో వైరల్

కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్లింది. దీంతో ప్రయాణికులకు దొరికిపోయి 10 కిలో మీటర్లు రైలు కిటికీకి వేలాడుతూ వెళ్లాడు ఆ దొంగ. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ప్రయాణికులు స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కిటికీ బయటవైపు అతడు ప్రమాదకరంగా వేలాడుతూ.. తన చేతులను వదిలేయవద్దని ప్రయాణికులను బతిమిలాడుకున్నాడు. బిహార్‌లోని ఖగారియా ప్రాంతంలో ఈ ఘటన ఈ నెల 14న చోటుచేసుకుంది.

Bihar Passengers: ప్రయాణికులకు దొరికిపోయి… 10 కి.మీటర్లు రైలు కిటికీకి వేలాడిన దొంగ.. వీడియో వైరల్

Bihar Passengers

Bihar Passengers: కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్లింది. దీంతో ప్రయాణికులకు దొరికిపోయి 10 కిలో మీటర్లు రైలు కిటికీకి వేలాడుతూ వెళ్లాడు ఆ దొంగ. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ప్రయాణికులు స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కిటికీ బయటవైపు అతడు ప్రమాదకరంగా వేలాడుతూ.. తన చేతులను వదిలేయవద్దని ప్రయాణికులను బతిమిలాడుకున్నాడు. బిహార్‌లోని ఖగారియా ప్రాంతంలో ఈ ఘటన ఈ నెల 14న చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు ఆ రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ నుంచి బయలు దేరిన సమయంలో ఓ యువకుడు చోరీకి యత్నించడంతో అతడి చేతులను ప్రయాణికులు ఒక్కసారిగా పట్టేసుకున్నారు. ఊహించని పరిణామంతో దొంగ భయపడిపోయాడు. రైల్వే స్టేషన్లలో చోరీలు చేసేవారికి తగిన బుద్ధి చెప్పేలా ప్రయాణికులు ఆ దొంగకు తగిన శిక్ష వేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Ghulam Nabi Azad Gets Threat: జమ్మూకశ్మీర్‌లో ర్యాలీలకు సిద్ధమవుతున్న గులాం నబీ ఆజాద్‌కు పాక్ ఉగ్రవాద సంస్థ వార్నింగ్