Chidambaram
Chidambaram: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నిరాధార ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చిందంటూ ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 13న హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23న విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపింది. వీటిపై చిదంబరం స్పందించారు. బీజేపీ నేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల పరిధిలో మాత్రం ఈడీ పనిచేయట్లేదని ఆయన విమర్శించారు.
prophet row: ప్రధాని మోదీ మౌనం వీడాలి: శశి థరూర్
జేబులో పర్సు లేని వ్యక్తి వద్ద నుంచి పర్సు చోరీ చేసినట్లు ఓ వ్యక్తిపై కేసు పెట్టి విచారణ జరపడం ఎలా ఉంటుందో నగదు అక్రమ చలామణీ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపడం కూడా అలాగే ఉందని చిదంబరం ఎద్దేవా చేశారు. ఈ తీరును నిరసిస్తూ రేపు రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఆయన కలిసి ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్తారని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని చిదంబరం చెప్పారు.