Health problems with tattoos : పచ్చబొట్టు వేయించుకుంటే అంతే…

పచ్చబొట్టు చెరిగిపోదులే.. పచ్చ బొట్టేసినా అంటూ ప్రేమను చాటుకునేందుకు పచ్చబొట్టు వేయించుకుంటారు. సరే.. ఈ టాటూలు వేయించుకోవడం ఎంతవరకూ సేఫ్? అంటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. టాటూ ఇంక్‌లో ఉండే లోహాలు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.

Health problems with tattoos : పచ్చబొట్టు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అయితే వేయించుకునేముందు అది మీకు మంచిదా? కాదా? ఆలోచించారా? ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు పచ్చబొట్టు వేయించుకోకూడదట.

Tarakaratna : తారకరత్న చేతి పై ఉన్న పచ్చబొట్టు ఏ హీరో సంతకమో తెలుసా?

చాలామంది తమకు బాగా ఇష్టమైన వారి పేరును పచ్చబొట్టు వేయించుకుంటారు. వారిపై తమ ప్రేమను చాటుకునేందుకు ఇదో గుర్తుగా భావిస్తారు. ఇక యూత్ అయితే రకరకాల డిజైన్లతో ఒళ్లంతా టాటూలు వేయించుకునే ట్రెండ్ కూడా నడుస్తోంది. అయితే పచ్చబొట్టు వల్ల స్కిన్ క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఎముకల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. టాటూ వేయడానికి వాడే ఇంక్ చాలా విషపూరితమైనది.. హానికరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

టాటూ ఇంక్‌లో సీసం, కాడ్మియం, ఆర్సెనిక్ మరియు పాదరసం లాంటి భారీ లోహాలు ఉంటాయి.ఇవి ఎంతో హానికరమైనవట. ఇక టాటూలు కొందరిలో అలర్జీని కలిగిస్తాయట. దురద, వాపు, దద్దుర్లు లేదా గడ్డలు ఇలా రావచ్చట. ఈ లక్షణాలు అన్నీ పచ్చబొట్టు వేయించుకున్న వెంటనే కనపడవచ్చునట. లేదంటే కొన్ని వారాలు, లేదా సంవత్సరాల తర్వాత కూడా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. పచ్చబొట్టులో ఉండే బెంజో(ఎ) పైరీన్ క్యాన్సర్ కారకమని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ స్పష్టం చేసింది.

Rajinikanth : గుండె మీద రజినీకాంత్ పచ్చబొట్టు వేసుకున్న హ‌ర్బ‌జ‌న్ సింగ్

టాటూను సూదితో వేయడం వల్ల దానితో పాటు బ్యాక్టీరియా, ఇతర వ్యాధి కారకాలు శరీరలోకి వెళ్లే అవకాశం ఉందట. ఇక పచ్చబొట్టు వేసే పరికరాలు పరిశుభ్రంగా లేకపోతే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మరియు హెచ్‌ఐవి వంటి రక్తసంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందట. కనుక పచ్చబొట్టు వేయించుకోవాలనుకునేవారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు