నటుడు సోనూ సూద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫ్యాన్స్ తెగ కొనియాడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి నేనున్నా..అంటూ భరోసా ఇవ్వడమే కాకుండా..తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. వెండి తెరపై విలనిజం పండించే ఈ నటుడు..కరోనా టైంలో హీరోగా అందరి గుండెల్లో నిలుస్తున్నాడు. వలస కూలీలకు సాయమందిస్తూ..తన సహృదయతను చాటు కుంటున్నాడు.
కొంతమంది అభిమానులు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ప్రధాన రహదారి వద్ద..భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హోర్డింగ్ ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పూలతో అలంకరించారు. కరోనా ఫైటర్ కింగ్ సోనూ సూద్ గా అభివర్ణించారు. కటౌట్ పక్కనే సబ్యసాచి మిశ్రా, రాణి పండా ఫొటోలు కూడా ఉన్నాయి. వీటికి ఫ్యాన్స్ పూజలు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
దీనిపై సోనూ సూద్ స్పందించారు. చాలా బాగానే ఉంది..కానీ ఇందుకు తాను అర్హుడిని కానని, ప్రేమ, అభిమానుల అండదండలు సజీవంగా ఉంచాయన్నారు. ఇటీవలే కేరళ రాష్ట్రంలో చిక్కుకపోయిన 167 మంది వలసకూలీలు ఒడిశాలోని వారి వారి స్వగ్రామాలకు చేరుకోవడానికి ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. వలస కార్మికులకు మద్దతుగా ముందుకు వచ్చానని..వారు పడుతున్న బాధలు చూస్తే గుండె తరుక్కపోతుందన్నారు సోనూ.
ఆఖరి వలస కూలీ తన స్వస్థలానికి చేరుకునే వరకు తాను రవాణా సౌకర్యం కల్పిస్తానని, ఇలా చేయడం నా హృదయానికి చేరువగా అనిపిస్తుందన్నారు. రాజ్యసభ ఎంపీ అమర్ పట్నాయక్ సోనూ చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. కార్మికులను స్వస్థలాకు పంపేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా..వెబ్ సైట్ ను ఏర్పాటు చేశారు. సోనూ సూద్ ను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీ అభినందించిన సంగతి తెలిసిందే.
ସବ୍ୟ , ରାଣୀ ପଣ୍ଡା ଏବଂ ସୋନୁ ଙ୍କୁ ପୂଜା କଲେ ରାଜଧାନୀ ରେ @SonuSood bhubaneswar mai @sabyasachi @sonu sir and @ranipanda ko puja karte hain @sabyaactor
??? pic.twitter.com/Zo6EYsf5c2— somanath jena (@somanathjena0) June 15, 2020
This is so sweet❣️.. but I don’t deserve this? just your love and wishes keep us alive ❤️ https://t.co/uYCos3t9Rr
— sonu sood (@SonuSood) June 15, 2020