Maharashtra
Maharashtra Father’s joy : ఆడపిల్ల పుడితే ఆడపిల్లా?… అనే రోజులు పూర్తిగా పోయాయి. ఆడపిల్లని బంగారుతల్లిగా భావించే రోజులు చూస్తున్నాం. తమ వంశంలో 35 ఏళ్ల తరువాత పుట్టిన ఆడపిల్లని ఓ తండ్రి ఎంత వైభవంగా తన ఇంటికి తీసుకెళ్లాడో చూసి ఆనందంతో అందరి కళ్లు చమ్మగిల్లాయి.
baby girl : 138 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీలో ఆడపిల్ల .. ఆసక్తి కలిగిస్తున్న స్టోరి
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌కు చెందిన గిరీష్ పాటిల్ పూణెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అతని భార్య సుధ. ఇటీవలే వీరికి ఆడపిల్ల పుట్టింది. చిన్నారికి ‘ఐరా’ అని కూడా పేరు పెట్టారు. పుట్టింటి నుంచి భార్యను, చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లేరోజు గిరీష్ ఎప్పటికీ గుర్తుండిపోవాలని అనుకున్నాడు. అందుకోసం ఓ ప్లాన్ చేశాడు.
Whatsapp Message : ఆఫ్రికాలో తండ్రి.. తెలంగాణలో కూతురు.. ఇద్దర్నీ కలిపిన వాట్సాప్ మెసేజ్
ఊరిలోకి ఎంటర్ అవుతుండగానే కూతురుని ఏనుగుపై కూర్చోబెట్టుకుని డప్పు, వాయిద్యాల మధ్య ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ల వంశంలో 35 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారంతా సంబరాల్లో మునిగి తేలారు.