Whatsapp Message : ఆఫ్రికాలో తండ్రి.. తెలంగాణలో కూతురు.. ఇద్దర్నీ కలిపిన వాట్సాప్ మెసేజ్

విడిపోయిన కొన్ని బంధాలు విచిత్రంగా కలుస్తుంటాయి. నైజీరియాలో ఉన్న తండ్రికి రెండేళ్లుగా ఆచూకీ తెలియకుండా పోయిన కూతురి అడ్రస్ తెలిసింది. తెలంగాణ నుంచి ఆఫ్రికా వరకు వెళ్లిన వాట్సాప్ మెసేజ్ వారిద్దరిని మళ్లీ ఒక్కటి చేసింది.

Whatsapp Message : ఆఫ్రికాలో తండ్రి.. తెలంగాణలో కూతురు.. ఇద్దర్నీ కలిపిన వాట్సాప్ మెసేజ్

Whatsapp Message

Father found out about his daughter : కరోనా రక్కసికి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు. ఆఫ్రికాలో ఉంటూ రెండేళ్లుగా కన్నబిడ్డ ఏమైందో తెలియక తల్లడిల్లుతున్న ఓ తండ్రికి కూతురి ఆచూకి తెలిసింది.

Father whatsapp status : తండ్రి వాట్సాప్ స్టేటస్ షేర్ చేసిన కూతురు.. రియాక్టైన స్విగ్గీ

రవిచంద్ర అనే వ్యక్తి నైజీరియాలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. రవిచంద్ర ఫ్యామిలీ అంతా విశాఖపట్నంలో ఉంటున్నారు. 2021 లో రవిచంద్ర భార్య కరోనాతో చనిపోయింది. ఆ సమయంలో నైజీరియాలో ఉన్న రవిచంద్ర భార్యను కడసారి చూసుకోలేకపోయారు. ఇక వారి బిడ్డలు 9 ఏళ్ల హాస్య, 11 ఏళ్ల మధులు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఉన్నారు. వాళ్లు కొంతకాలానికి హైదరాబాద్ వెళ్లిపోతు తమ దూరపు బంధువైన ఆండాళ్లు అనే మహిళకు అప్పగించారు.

 

ఆమె కొంతకాలం తరువాత హాస్యని కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కి చెందిన భాగ్యలక్ష్మికి అప్పగిస్తే ఇక ఆమె తన బంధువైన లచ్చవ్వకి ఇచ్చింది. అలా హాస్య ఎగ్లాస్పూర్ అనే గ్రామానికి వెళ్లింది. ఆమె భాష, యాస గమనించిన సర్పంచ్ కె.రాజరెడ్డి హాస్య, ఫోటో వివరాలు వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేసి  సైదాపూర్ ఎస్ఐ నెంబర్ కూడా పెట్టారు.

Kangana Ranaut : కంగనా, అతను విడిపోవాలని చాలా మంది అనుకున్నారు.. కంగనా రిలేషన్ పై నటుడి తండ్రి వ్యాఖ్యలు..

ఆ మెసేజ్ నైజీరియాలోని రవిచంద్రకు వరకు చేరింది. రవిచంద్ర వెంటనే సబ్ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడి వెంటనే ఇండియాకు వచ్చాడు. తన కూతురిని చూసుకుని పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. అయితే హాస్యను తిరిగి తన వెంట తీసుకువెళ్లడానికి కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉందని తెలిపాడు. మొత్తానికి కరోనా కారణంగా విడిపోయిన తండ్రీకూతుళ్లను తిరిగి వాట్సాప్ మెసేజ్ ఒక చోటకి చేర్చింది.