East Godavari News
East Godavari News : ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల్లో కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటిదే ఒక న్యూస్. అందంగా ముగియాల్సిన పెళ్లి వేడుక కాస్త ఓ చిన్న కారణంతో యుద్ధంరంగంలా మారిపోయింది. పెళ్లివారంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
Old Man Dance Goes Viral : మనవడి పెళ్లిలో 96 ఏళ్ల వృద్ధుడు చేసిన డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెడతారు
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రాపురంలో సుబ్రహ్మణ్యం, పూజితల పెళ్లి వేడుకకు ఘనంగా జరిగింది. పెళ్లైన తరువాత చక్కని విందు కూడా ఏర్పాటు చేసారు. అదే సమయంలో అక్కడ ఉన్న బంధువులంతా పెళ్లికూతురుని డ్యాన్స్ చేయాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు ఆమ్మాయి తరపు వారు అభ్యంతరం చెప్పారు. ఆడపిల్ల డ్యాన్స్ చేయడం ఏంటని అబ్బాయి తరపువారిని నిలదీశారు. అబ్బాయి తరపు వారు ఆడపెళ్లివారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళకు తలకు తీవ్ర గాయాలు కాగా.. మరో వ్యక్తికి చేయి విరిగింది. మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
Fight For Paneer : ఏం మనుషులు రా నాయనా.. పెళ్లిలో పనీర్ కోసం కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు
ఇంకేముందు? వధూవరులతో సహా ఆడ,మగ పెళ్లివారంత పోలీస్ స్టేషన్‌కి చేరుకుని ఫిర్యాదులు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం వధువు డ్యాన్స్ చేయదన్నందుకు చెలరేగిన గొడవ ఇక ఎప్పుడు చల్లారుతుందో? ఆ జంట భవిష్యత్ ఏంటో? పోలీసులు డిసైడ్ చేయాలి.