Fight For Paneer : ఏం మనుషులు రా నాయనా.. పెళ్లిలో పనీర్ కోసం కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

పెళ్లి వేడుకలో వరుడికి పనీర్ వడ్డించ లేదని వరుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా పొట్టు పొట్టు కొట్టుకునే వరకు వెళ్లింది.

Fight For Paneer : ఏం మనుషులు రా నాయనా.. పెళ్లిలో పనీర్ కోసం కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు

Fight For Paneer : అదో పెళ్లి వేడుక. అటు వరుడు, ఇటు వధువు కుటుంబసభ్యులు తరలివచ్చారు. అంతా హ్యాపీగా ఉన్నారు. అక్కడ పెళ్లి సందడి నెలకొంది. అంతా సజావుగా సాగిపోతోంది. ఇంతలో ఒక్కసారిగా కలకలం రేగింది.

అక్కడ ఘర్షణ జరిగింది. వరుడు, వధువు కుటుంబసభ్యులు గొడవ పడ్డారు. చూస్తుండగానే వివాదం పెద్దదైంది. అంతే, కర్రలతో ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన జనాలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

Also Read..Delhi Wedding: పెళ్లిలో ప్లేట్ల కోసం గొడవ.. క్యాటరింగ్ సిబ్బందిపై దాడి చేసిన మ్యూజిక్ బ్యాండ్.. ఒకరి మృతి

ఇంతకీ ఈ ఘర్షణకు కారణం ఏంటో తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఈ గొడవ జరిగింది పనీర్ కోసం. ఏంటి షాక్ అయ్యారు కదూ. కానీ, ఇది నిజం. పెళ్లి వేడుకలో వరుడికి పనీర్ వడ్డించ లేదని వరుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా పొట్టు పొట్టు కొట్టుకునే వరకు వెళ్లింది.

Also Read..Pappadam: పప్పడం వేయలేదని పెళ్లిలో గొడవ.. కుర్చీలు విరగ్గొడుతూ నానా హంగామా

ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బాగ్ పత్ లో ఓ వివాహ వేడుకలో వరుడికి పనీర్ వడ్డించ లేదని గొడవ మొదలైంది. వధువు బంధువులతో వరుడి బంధువులు గొడవ పడ్డారు. ఆ తర్వాత మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ఇరువర్గాల వారు కర్రలు, బెల్టులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారి గొడవ ఎంత పెద్దది అయిందంటే.. ఏకంగా పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హవ్వ అని నెత్తి బాదుకుంటున్నారు. పన్నీర్ కోసం ఇంతగా కొట్టుకోవాలా అని విస్తుపోతున్నారు. మీరసలు మనుషులేనా? అని మండిపడుతున్నారు.