Delhi Wedding: పెళ్లిలో ప్లేట్ల కోసం గొడవ.. క్యాటరింగ్ సిబ్బందిపై దాడి చేసిన మ్యూజిక్ బ్యాండ్.. ఒకరి మృతి

బుధవారం రాత్రి ఒక పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకలో ఒక మ్యూజిక్ బ్యాండ్ పాల్గొంది. వేడుక అనంతరం భోజనం చేసేందుకు వెళ్లింది మ్యూజిక్ బ్యాండ్. ఆ సమయంలో అక్కడ తినడానికి ప్లేట్లు లేవు. దీంతో క్యాటరింగ్ సిబ్బందిపై మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Delhi Wedding: పెళ్లిలో ప్లేట్ల కోసం గొడవ.. క్యాటరింగ్ సిబ్బందిపై దాడి చేసిన మ్యూజిక్ బ్యాండ్.. ఒకరి మృతి

Delhi Wedding: పెళ్లి విందు సందర్భంగా డిన్నర్ ప్లేట్ల విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ప్లేట్లు రావడం ఆలస్యమైందని క్యాటరింగ్ చేసే వ్యక్తిని కొట్టి చంపింది మ్యూజిక్ బ్యాండ్. ఈ ఘటన ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది.

Raja Singh: ఊడిపోయిన కారు చక్రం.. ఎమ్మెల్యే రాజా సింగ్‌కు తప్పిన ప్రమాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఒక పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకలో ఒక మ్యూజిక్ బ్యాండ్ పాల్గొంది. వేడుక అనంతరం భోజనం చేసేందుకు వెళ్లింది మ్యూజిక్ బ్యాండ్. ఆ సమయంలో అక్కడ తినడానికి ప్లేట్లు లేవు. దీంతో క్యాటరింగ్ సిబ్బందిపై మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి క్యాటరింగ్ సిబ్బందిలో ఒకడైన సందీప్ సింగ్ సమాధానం ఇచ్చాడు. ప్లేట్లు కడుగుతున్నారని, కొద్ది సేపట్లోనే ప్లేట్లు వస్తాయని చెప్పాడు. అయినప్పటికీ శాంతించని మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు, సందీప్ సింగ్‌తోపాటు క్యాటరింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్లేట్లు రావడం మరింత ఆలస్యం కావడంతో, క్యాటరింగ్ సిబ్బందిపై దాడి చేశారు.

Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా

ఈ ఘటనలో సందీప్ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని క్యాటరింగ్ స్టాఫ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సందీప్ సింగ్‌పై దాడి, హత్యకు నలుగురిని బాధ్యులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.